Thursday, September 1, 2011

అల్లూరి సీతారామరాజు , Alluri Sitaramaraju

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -అల్లూరి సీతారామరాజు - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

భారత స్వాతంత్య్ర చరిత్రలో అల్లూరి సీతారామరాజు ఒక మహోజ్వల శక్తి. ఇతడు జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక ప్రత్యేక అధ్యాయం. సాయుధ పోరాటం ద్వారానే స్వతంత్రం వస్తుందని నమ్మి, దాని కొరకే తన ప్రాణాలర్పించిన యోధుడు అల్లూ రి. కేవలం 27 ఏళ్ళ వయసులోనే నిరక్షరా స్యులు, నిరుపేదలు, అమాయకులు అయిన అనుచరులతో, చాలా పరిమిత వనరులతో బ్రిటీషు సామ్రాజ్యమనే మహాశక్తిని ఢీకొన్నాడు.సీతారామరాజు ఇంటిపేరు అల్లూరి. అల్లూ రివారు తూర్పు గోదావరి జిల్లా కోనసీమకు చెందిన రాజోలు తాలూకా కోమటిలంక, బట్టేలంక గ్రామాలలో స్థిరపడ్డారు. కోమటి లంక గోదావరిలో ముని గిపోవడం వల్ల వా రు అప్పనపల్లి, అంతర్వేది పాలెం, గుడిమాల లంక, దిరుసుమర్రు, మౌందపురం వంటిచో ట్లకు వలస వెళ్ళారు.

ఇలా అప్పనపల్లి చేరిన అల్లూరి వీరభద్రరాజు తరువాత గుంటూరు జిల్లా నరసరావుపేట తాలూకాలోని బొప్పూడి గ్రామంలో స్థిరప డ్డాడు. ఇతనికి ఆరుగురు కుమారులు. వెంకట కృష్ణంరాజు, సీతారామ రాజు, గోపాలకృష్ణంరాజు, వెంకట నరసింహ రాజు, అప్పలరాజు, వెంకట రామరాజు. వీరి లో గోపాలకృష్ణంరాజు కొడుకు వెంకటకృష్ణం రాజు (సీతారామరాజుకు తాత), వెంకటకృ ష్ణంరాజు, అతని పెదతండ్రి వెంకట నరసిం హరాజు బొప్పూడి గ్రామంనుండి పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలో పాల కోడేరు మండలం మోగల్లు గ్రామంలో స్థిరప డ్డారు. వెంకటకృష్ణం రాజు ఐదుగురు కొడు కులు రామచందర్రాజు, వెంకటరామరాజు (సీతారామరాజు తండ్రి), రామకృష్ణంరాజు, రంగరాజు, రామభద్రరాజు. అల్లూరి సీతారా మరాజు 1897 జూలై 4 న వెంకట రామ రాజు, సూర్యనారాయణమ్మలకు జన్మించాడు. ఈ దంపతులకు సీతమ్మ అనే కుమార్తె (ఆమె భర్త దంతులూరి వెంకటరాజు), సత్యనారాయ ణరాజు అనే మరొక కుమారుడు కూడా ఉన్నాడు.

For more details -> Alluri Sitaramaraju in Telugu
  • ========================================
Visit My website - > Dr.Seshagirirao

2 comments: