![[Rangarao+S.V-DAASI(1952).jpg]](https://blogger.googleusercontent.com/img/b/R29vZ2xl/AVvXsEgQ1KRBYMwlOosVi3k28Dd1MRV7w_39BPIad-OWpFNpYAbdabOFof7TAB4flGf3dHLYWefFV64YBA4YWDgpvcws_GtrzKhoTGgG7QOAXWiX15U7Nx_9IuV9pxHb22_NmMLqzZnbp_uB1rA/s1600/Rangarao+S.V-DAASI(1952).jpg)
- S.V.Rangarao - Tollywood actor.
సుప్రసిద్ధ తెలు గు సినీ నటుడు ఎస్వీ రంగారావు పూర్తి పేరు సామర్ల వెంకట రంగారావు. కృష్ణా జిల్లా లోని నూజివీడులో 1918 జూలై 3 వ తేదీన లక్ష్మీ నరసాయమ్మ, కోటేశ్వరరావులకు దంపతుల కు జన్మించాడు. తండ్రి ఎక్సైజు శాఖలో పని చేసేవాడు. యస్.వి.రంగారావు హిందూ కాలే జిలో చదివాడు. డిగ్రీ వరకూ చదివి, అగ్నిమా పక దళంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూ.. షేక్స్‌పియర్ ఆంగ్ల నాటకాలలో ఒథెల్లో, షైలాక్ తదితర పాత్రలు పోషించి ప్రముఖ రంగ స్థల కళాకారుడిగా విశేష ఖ్యాతి గడించాడు. ఆ తర్వాత బి.వి.రామానందం దర్శకత్వంలో నిర్మించిన "వరూధిని" చిత్రంలో ప్రవరాఖ్యుడి గా తెలుగు చలనచిత్ర రంగానికి పరిచయమ య్యాడు.నట యశస్వి గా పేరు పొందిన ఈ నటుడు మూడు దశాబ్దాలపాటు మూడొందల చిత్రాలకు పైగా అద్భుతంగా నటించి ఘటో త్కచుడిగా, కీచకుడిగా, రావణాసురుడిగా తనకు తానే సాటిగా ఖ్యాతి గడించాడు. ఆయా పాత్రలలో ఆయన ఎంత మమేకమైపో యారంటే, వేరెవరు కూడా ఆ పాత్రలలో ఇప్పటివరకు ఇమడలేకపోయారు.
మరింత సమాచారము కోసం --> ఎస్.వి.రంగారావు -నటుడు
- ====================================
No comments:
Post a Comment