Saturday, April 5, 2014

Ganteda Gaurunaidu - Writer,గంటేడ గౌరునాయుడు-రచయిత

  •  
  •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -గంటేడ గౌరునాయుడు-రచయిత - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


కండగల, కన్నుగల కథకుడు గంటేడ గౌరునాయుడు
ఉత్తరాంధ్రలో కొనసాగుతోన్న ఒక సాహితీ సాంస్కృతిక పరంపరకు నేటి తరంలో ప్రతినిధులెవరు? అన్న ప్రశ్న వేసుకోవలసిన అవసరం ఉందా? అంటే ీలేదు' అన్నదే సరైన సమాధానం. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే కథ పుట్టిందీ, ఇప్పటికీ అక్కడే వెలుగుతోందీ. అటువంటప్పుడు ప్రతినిధిగా ఒక్కరిని చూపడం భావ్యంకాదు. అయితే గురజాడ తర్వాత చాసో, రావిశాస్త్రి, బలివాడ, పూసపాటి, దాట్ల, భూషణం, కారామాష్టారు, పంతుల జోగారావు, పతంజలి, శ్రీపతి, అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు, బమ్మిడి జగద్వీరరావు... ఇలా ఆ జాబితా అనంతం. జాబితా మాత్రమే తయారుచేయవలసి వస్తే ఇంకా అనేక మంది చేరుతారు. అయితే ీుకండగల'' రచయితల జాబితా తయారు చేస్తే మాత్రం ఇలా... ఈ పేర్లు తప్పక నిలుస్తాయి. గిరిజన రైతాంగ యోధుల క్షతగాత్ర గానంనుంచీ, జమీందారీ వ్యతిరేక పోరాటాలనుంచీ, కోస్తా దాడులనుంచీ, వ్యవసాయక విప్లవ సారథ్యంనుంచీ గొంతెత్తి, తమ నేలతల్లికోసం, విముక్తికోసం సామూహిక గానంచేస్తోన్న గంటేడ గౌరునాయుడి స్వరం తప్పక వినిపిస్తుంది. హంగూ, ఆర్భాటమూ లేకుండా, నేల పొత్తిళ్లలోంచి, తలెత్తి, చిరుగాలికి పులకించే మొలకల్లా, గౌరనాయుడూ, గౌరునాయుడు కథలూ ఉంటాయి -'' ఈ మాటలన్నది మరెవరో కాదు... ఎవరైతే గౌరునాయుడి సాహితీ సృజనకు స్ఫూర్తిగా నిలిచారో ఆ అప్పలనాయుడే. ఈ గౌరునాయుడ్ని దగ్గరగా, సహచరుడిగా, స్నేహితుడిగా యెరిగిన నేను అతనిని గ్రామీణ జానపద కథకుడిగానూ, మంచినికోరే రచయితగానూ ప్రాంతీయ ఆర్థిక, సామాచ్కీజిజిక చ్కీజీజివిత చిత్రకారుడిగానూ - అతని కథల ద్వారా అర్థం చేసుకున్నాను -'' అదీ గంటేడ గురించి!

1954 ఆగస్టు ఏడో తేదీ విజయనగరం జిల్లా కొమరాడ మండలం, దళాయిపేటలో సోములమ్మ, సత్యంనాయుడు దంపతులకు జన్మించిన గౌరునాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. పట్టా పొందారు. ఆ తర్వాత బిఇడి చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే 1983లో శారదపెళ్లి'' అనే కథ రాశారు. కథ రాయాలన్న ఉద్దేశంతో ఆ కథ రాశారు. ఆ మాటకొస్తే 1989 వరకు రాసిన కథలన్నీ అటువంటివే. సామాజిక అవగాహనతో, తన ప్రాంత ప్రజల పట్ల ఆర్తితో, వారిపట్ల తన కర్తవ్య నిర్వహణతో రాయడం మొదలుపెట్టింది మాత్రం 1989లోనే. అలా రాసిన తొలికథ  '' స్త్రీ విముక్తి'' తానెందుకు అలా చెప్పుకుంటాడో ఆయన మాటల్లోనే-'' కారా, రావిశాస్త్రి, చా.సో, భూషణం గార్ల కథల పరిచయంతో పాటు 1988లో అప్పల్నాయుడి పోడు-పోరు' కథల సంపుటి ప్రధానంగా నన్ను మలుపుతిప్పాయి... నిజమే! ఏ రచయితకైనా సరైన లక్ష్యం, గురి కుదిరేంతవరకు దారి సరిగా ఉండదు. ఒక్కసారి తానేమిటో, తను ఎవరికోసం రాయాలో, ఎందుకు రాయాలో తెలుసుకొన్న తర్వాత ఆ రచనలు పదునుగానే కాదు, భిన్నంగానూ ఉంటాయి. కథకుడిగా కలంగేట్రం  చేసిన అయిదారు సంవత్సరాలకి ఇవి తెలుసుకొన్న గంటేడ గౌరునాయుడు ఆ తర్వాత పక్కదారులు పట్టలేదు. ఒక దశాబ్దకాలంలోనే మేజర్‌ రచయిత అయ్యారు. ఉత్తరాంధ్రకు ప్రతినిధిగా మారారు.

భూమిపుండు, ఏటిపాట, బతుకాకు, ఒకరాత్రి - రెండుస్వప్నాలు, చ్కీజీజివన్మృతులు, విముక్తి, నీటిముల్లు, నరాలు తెగుతున్ననేల, బడిసాల, అవతలిఒడ్డు, కొండమల్లె, రాగాలచెట్టు, రక్తాశ్రువు, రంగురంగుల చ్కీచీజికట్లోకి, తిరుగుడుగుమ్మి, భూమివుండు, చ్కీజీజివసూత్రం... ఇలా అనేక కథలు కల్పితాలు కావు. ఆయా కాలాల్లో ఆయా ప్రాంతాల్లో చెదరిన చ్కీజీజివితాల సారాంశమే అది! ఛిద్రమైన జీవితాల అడుగులే అవి, బలైన మనుషుల పొలికేకలే అవి, ఆర్తుల ఆక్రందనలే అవి!

గౌరునాయుడు తన చుట్టూ ఉన్న జీవితాల్ని అసహ్యించుకోలేదు. వాటినుంచి పారిపోవాలనీ అనుకోలేదు. వాటినుంచి తానూ, తనతోపాటు అందరూ ఎదగాలని ఆకాంక్షించారు. ఆ ప్రాంతాన్ని నిండుగా ప్రేమించారు. అక్కడ చోటుచేసుకొన్న, ఇంకా చోటుచేసుకుంటోన్న అవాంఛనీయ పరిణామాలను చూసి ఉగ్రుడయ్యారు; వాటిని నిలదీస్తున్నారు; వాటికి కారకులైన వారిని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అవసరమైనపుడు ద్వేషిస్తున్నారు కూడా. అందుకే ఆయన కళింగాంధ్ర ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గుర్తెరిగిన రచయిత అయ్యారు; వాటిని బలంగా వ్యక్తం చేయగలిగిన రచయిత అయ్యారు. ఒక రావిశాస్త్రి, ఒక కా.రా. వంటి వారికి ఇష్టుడయ్యారు.

గౌరునాయుడులో కథకుడు, కవి కలసి ఉన్నారు. 1997లోఏటిపాట'' కథల సంపుటి ప్రచురించిన నాయుడు 98 లో పాడుదమా స్వేచ్ఛగీతం, 2001లో కళింగోర', 2002 నాగేటి చాలుకు నమస్కారం, 2004లో రవీంద్ర గీతాంజలి, 2005 ప్రియ భారత జననీ' వంటి పాటల సంకలనాలు ప్రచురించారు. చాసో స్ఫూర్తి సాహిత్య పురస్కారం, జ్యేష్ఠ లిటరరీ పురస్కారం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, విశాల సాహితి పురస్కారం అందుకొన్న నాయుడిది కవితాత్మక శైలి. అప్పల్నాయుడి మాటల్లో చెప్పాలంటే - వాతావరణాన్నీ, పాత్రల్నీ, కవితాత్మకంగా వర్ణించే వాక్యాలు గౌర్నాయుడి శైలి... ఏ కథలోనైనా... సహజాతి సహజ వాతావరణంలో పాఠకుడు నడుస్తాడు. ఉపమానాలు కవితాత్మక వాక్యాలు సందర్భానికి అతికినట్టుగాదు, సందర్భంలో ఉద్భవించి నట్టుంటాయి...'' నిజమే ప్రతికథ ప్రారంభం ఎంత అద్భుతంగా మొదలవుతుందో, ముగింపూ అంతే గాఢతతో, జీవనానుభవ సారంతో ముగుస్తుంది. పాఠకుల మనసుల్ని ఆలోచనల్లో పడవేస్తుంది. మనస్సున్న వారిని ఒకచోట కుదురుగా ఉండనీయక కలవరపెడుతుంది. కథకుడిగా గౌరునాయుడి విజయరహస్యం ఇదే!

  • -చీకోలు సుందరయ్య@ ఈనాడు సాహిత్యము

  • ============================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment