Showing posts with label జంధ్యాల పాపయ్యశాస్ర్తి. Show all posts
Showing posts with label జంధ్యాల పాపయ్యశాస్ర్తి. Show all posts

Sunday, July 31, 2011

జంధ్యాల పాపయ్యశాస్ర్తి , Jandhyala-Papayya-Shastry



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -జంధ్యాల పాపయ్యశాస్ర్తి - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


జంధ్యాల పాపయ్యశాస్ర్తి - ఆగస్ట్‌ 4, 1912వ సంవత్స రంలో ప్రముఖ కవి జంధ్యాల పాపయ్యశాస్ర్తి జన్మించారు. వీరి కలం పే రు ‘కరుణశ్రీ’. ఉదయశ్రీ, విజయశ్రీ, కరుణశ్రీ, ఉమర్‌ ఖయ్యూం వీరి రచనలు. కుంతి కుమారి, పుష్పవిలాపం (ఘంటసాల గానం చేశారు) మొదలైన కవితా ఖండికలు బహుళ జనాదరణ పొందాయి. 20వ శతాబ్దములో బాగా జనాదరణ పొందిన తెలుగు కవులలో ఒకరు. వీరి కవిత్వము సులభమైన శైలిలో, సమకాలీన ధోరణిలో, చక్కని తెలుగు నుడికారముతో విన సొంపై యుండును. ఖండకావ్యములు వీరి ప్రత్యేకత. అందునా కరుణ రస ప్రధానముగా చాలా కవితలు వ్రాసి, "కరుణశ్రీ" అని ప్రసిద్దులైనారు. మృదు మ దురమైన పద్య రచనా శైలి వీరి ప్రత్యేకత. జూన్‌ 22, 1992లో పాపయ్యశాస్ర్తి పరమపదించారు. ప్రముఖ సినీ దర్శకుడు జంధ్యాల వీరి కుమారుడే.

రచనలు
o 2.1 పుష్పవిలాపం పద్యాలు
o 2.2 కుంతీకుమారి పద్యాలు
o 2.3 అంజలి పద్యాలు
కవితలు ఘంటసాల గారి రికార్డుల ద్వారా బాగా ప్రాచుర్యము పొందాయి.


విద్య, ఉద్యోగం :

కరుణశ్రీ గుంటూరు జిల్లా, పెదనందిపాడు మండలములోని కొమ్మూరు గ్రామములో 1912 ఆగస్టు 4న జన్మించాడు. తల్లి మహాలక్ష్మమ్మ, తండ్రి పరదేశయ్య. కొమ్మూరులో ప్రాధమిక, మాగధ్యమిక విద్య చదివిన పాపయ్యకు సంస్కృత భాషపై మక్కువ పెరిగింది. భమిడిపాటి సుబ్రహ్మణ్యశర్మ, కుప్పా ఆంజనేయశాస్త్రి వద్ద సంస్కృత కావ్యాలు చదివాడు. రాష్ట్ర భాషా విశారద, ఉభయ భాషా ప్రవీణ, హిందీ భాషా ప్రవీణ పరీక్షలలో ఉత్తీర్ణుడై అమరావతి రామకృష్ణ విద్యాపీఠములోనూ, గుంటూరు స్టాల్ గర్ల్స్ హైస్కూలులోనూ, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోనూ అధ్యాపకునిగా పని చేశాడు.



  • =============================================
Visit My website - > Dr.Seshagirirao