వేగుంట మోహనప్రసాద్, ప్రముఖ కవి, రచయిత .‘మో’ పేరుతో సాహితీలోకంలో సుప్రసిద్ధులైన ఈయన తెలుగు ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతుడిగా పేరొందినారు . వేగుంట మోహనప్రసాద్ చితచింత, పునరపి, రహస్యతంత్రి, నిషాదం, సాంధ్యభాష తదితర ఏడు కవితా సంకలనాలు వెలువరించారు. గ్రీకు సాహితంతోనూ ఆయనకు పరిచయం ఉంది. బతికిన క్షణాలు ఆయన జీవిత చరిత్ర, సాహిత్య అకాడమీకి పలు అనువాదాలు చేశారు. కరచాలనం పేరుతో వ్యాసాల ద్వారా ప్రసిద్ధ రచయితలను పాఠకులకు పరిచయం చేశారు. కొద్ది రోజుల క్రితమే ఆయన ఈ ఏడాది ప్రారంభించిన తనికెళ్ల భరణి సాహిత్య పురస్కారం అందుకున్నారు.
ఆయన తొలి కవితా సంకలనం చితి- చింత. చివరి కవిత్వం నిషాదం. దీనికి తణికెళ్ల భరణి అవార్డు లభించింది. విజయవాడలోని సిద్ధార్థ కళాశాలలో ఆయన ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశారు. చివరి దశలో ఆయన కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం అనుసృజన (అనువాద) శాఖకు అధిపతిగా పనిచేశారు.
ప్రముఖ కవి డాక్టర్ సి.నారాయణరెడ్డి మాట్లాడుతూ వేగుంట కవిత్వం అధివాస్తవికతతో ఉంటుందని, తొలిసారి చదివితే ఏమో అనిపిస్తుందని, మరల మరల చదివితే అమ్మో అనిపిస్తుందని వివరించారు. కవిత్వంలో ఆయన స్వేచ్ఛావాది. మోగా ప్రసిద్ధుడైన వేగుంట మోహన్ ప్రసాద్ కవిత్వమే ఊపిరిగా జీవించారు. ఆయన స్వస్థలం ఏలూరు సమీపంలోని వడ్లూరు. తండ్రి వెంకట కనకబ్రహ్మం టీచర్.
'మో'గా సాహితీలోకంలో లబ్ధప్రతిష్ఠుడు, ఆధునిక యుగంలో నూతనపంథాకు నాంది పలికిన ప్రముఖ కవి, రచయిత, అనువాదకుడు వేగుంట మోహనప్రసాద్(మో) (69) విజయవాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం(03-08-2011) తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో సాహితీవేత్తలు, సాహితీసంఘాలు దుఃఖసాగరంలో మునిగాయి. అభిమానులు, బంధుమిత్రులు, సాహితీవేత్తలు, మొగల్రాజపురంలోని ఆయన స్వగృహంలో 'మో' భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. ఆయన ఏకైక కుమార్తె మమత చేతులమీదుగా కృష్ణలంక స్వర్గపురిలోని విద్యుత్తు
దహనవాటికలో అంత్యక్రియలు జరిగాయి. 'మో' తన నేత్రాలు, కాలేయం, మూత్రపిండాలను దానం చేశారు.
source -- Telugu New papers
- ====================================