Showing posts with label Madduri Annapoornayya-మద్దూరి అన్నపూర్ణయ్య. Show all posts
Showing posts with label Madduri Annapoornayya-మద్దూరి అన్నపూర్ణయ్య. Show all posts

Thursday, October 25, 2012

Madduri Annapoornayya-మద్దూరి అన్నపూర్ణయ్య

  •  
  • మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -మద్దూరి అన్నపూర్ణయ్య - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
  • హద్దులు లేని దేశభక్తుదు , త్యాగి  మద్దూరి అన్నపూర్ణయ్య. . . బ్రతకడానికి కావల్సిన  భోజము కూడా లేని రోజుల్లో - నా దేశం , నా ప్రజలు , స్వాతంత్ర సమరం - అని తలపించిన గొప్ప నాయకుడు , మన తెలుగువాడు , హద్దులులేని దేశభక్తి గల మేరునగధీరుడు .. మద్దూరి . మహాత్మాగాంధీని రాజకీయరంగములో ఆశీర్వదించిన  లోకమాన్య బాలగంగాధర్ తిలక్  ప్రభావం తో , స్పూర్తి తో ఎదిగిన నాయకుడు మద్దూరి. అంతే కాదు తిలక్ నా గురువని ప్రకటించుకున్నారు కూడా. 
  • కాకినాడలో పి.ఆర్ . ఉన్నత పాఠశాలలో తెల్లదొరలను గజగజలాడించిన అల్లూరిసీతారామరాజు విగ్రహం పక్కనే మద్దూరి అన్నపూర్ణయ్య విగ్రహం ఉంది . అదీ ఆయన నాయక స్థాయి. అల్లూరి , మద్దూరి .. ఇద్దరూ పి.ఆర్ విద్యాలయములో సహాధ్యాయులు.  అల్లూరి సీతారామరాజు , మద్దూరిని సముద్రం ఒడ్డుకూ , అక్కడికీ , ఇక్కడికీ తీసుకువెళ్ళేవాడు . మన చదువులు బానిస చదువులు , దేశసేవ చేయడానికి బి.ఎ. వంటి డిగ్రీలు అవసము లేదని అంటూ '' అన్నపూర్ణయ్యా ! అదిగో ఆకాశం లో ఆ పక్షి ఎంత స్వేచ్చగా , హాయిగా ప్రయాణిస్తోందో . . . మనకా స్వేచ్చ ఉందా? '' అంటూ స్పూర్తిధాయక పద్యాలను వినిపించేవాడు.  విద్యార్ధులుగా మనము నాటకప్రదర్శనలు వంటివాటిలో పతకాలూ , అవి  తీసుకోకూడదు . ఎందుకంటే వాటుపై బ్రిటిష్ రాజ సిహ్నాలున్నాయి.  అవి మనబానిస చిహ్నాలు  అంటూ రామరాజు ఆ పతకాలను ఉద్రేకంగా నేలపై  విసిరేయడం మద్దూరి లో ఆలోచనలను రేకెత్తించినది .  క్రిస్మస్ సెలవులకు అల్లూరి వెళితే మళ్ళీ ఎప్పుడొస్తాడా అని ఎదురుచూపులు చూసేవాడు అల్లూరి బాల్యమితృడు మద్దూరి అన్నపూర్ణయ్య. 
  • తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురానికి  ఐదు మైళ్ళ దూరములో కొమరగిరి గ్రామములో మద్దూరి అన్నపూర్ణయ్య 1899 మార్చి 20 తేదీన ' జయరామయ్య , రాజమ్మ లకు జన్మించారు.  తుని , పిఠాపురము , పెద్దాపురం , రాజమండ్రి , కాకినాడ ప్రాంతాలలో విద్యాభ్యాసము చేశారు. 
  • 1924 లో 25 ఏళ్ళ యువకునిగా - ఆంధ్ర రాస్ట్ర యువజన కాంగ్రెస్ స్థాపించారు. ప్రరప్రభుత్వము పై కరపత్రము వేసినందుకు 18 నెలలు కఠిన శిక్ష చవిచూసారు. 1925 లో రాజమండ్రి సమీపంలో గోదావరి తీరము లో సీతానగరం లో సత్యాగ్రహ ఆశ్రమం లో చేరారు. కాంగ్ర్స్  పత్రికకు సంపాదక వీరుడై ప్రధమ స్వాతంత్ర్య సమర గాధల్ని విప్లవ వీరగాధల్ని , అల్లూరి మన్యం తిరుగు బాటుని , చిచ్చులపిడుగు వ్యాసాన్ని  ప్రచురించి 2 ఏళ్ళు కఠిన కారాగార శిక్ష అనుభవించారు .  ఆశ్చర్యకర అంశమేమిటంటే .. మొత్తం మీద 14 ఏళ్ళు కారాగార శిక్ష అనుభవించారు . రాజమండ్రి , బళ్ళారి , తిరుచునాపల్లి , వేలూరు , కడలూరు జైళ్ళలో ఆయన శిక్షలను ఆనందము గా అనుభవించారు. యాబై ఆరేళ్ళ తన జీవితం లో 14 ఏళ్ళు జైళ్ళలో గడపడం చెప్పుకోదగ్గ విషయము .తాను సంపాదకత్వము వహించిన ' కాంగ్ర్స్ పత్రికలో ' ఎవరో రచయిత రాసిన వ్యాసానికి తెల్లదొరతనం గొడవచేయగా ఆ వ్యాసరచయిత పేరుచెప్పకుండా తానే భాధ్యతవహించి జైలుశిక్షను అనుభవించిన ఉత్తమ ప్రమాణాలుగల పత్రికా సంపాదకుడు మద్దూరి. తెల్లదొరతనము ఎవరినో చంఫి  అల్లూరి సీతారామరాజు ను చంపేసినట్లు ఓ ఫొటో ప్రకటించ గా .. వెంటనే స్పందించిన అన్నపూర్ణయ్య తన కాంగెస్ పత్రికలో దొరతనము చంపింది అల్లూరిని కాదు , వారు ప్రకటించిన ఫొటో సీతారామరాజు ది కానేకాదు అని ప్రకటించి అందరినీ ఆశ్చర్య పరచిన వారు ఈ గొప్పవ్యక్తి. ఆయన జైలలో ఉన్న కొన్ని సందర్భాలలో సుభాష్ చంద్రబోస్  కుటుంబానిని మనియార్డలు పంపించేవారట. 
  • ఆర్ధికాంశాల్లో ''కారల్ మార్క్'' ని అభిమానించిన  అన్నపూర్ణయ్య  ఆత్యాద్మిక యాత్మిక అంశాల్లొ ''మెహర్ బాబా'' ను అనుసరించడం ఆయన స్వతంత్ర ఆలోచనా విధానాని కి దర్పణం. గాంధీజీ- అల్లూరి సీతారమరాజు గురించి యంగ్ ఇండియాలో రాయడానికి కారణము మద్దూరి అన్నపూర్ణయ్య  గాంధీజీ కి వ్రాసిన లేఖ కారణమని చెప్తారు . కాంగెస్ , నవశక్తి , జై భారత్ , వెలుగు -అనే నాలుగు పత్రికల్ని ఆదర్శవంతం గా  నడిపిన పత్రికా సంపాదకుడు శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య గారు.కొన్నాళ్లు తరువాత ' గోడ ' పత్రిక నిర్వాహకులలో అతిముఖ్యుడు , స్వాతంత్ర సమరయోధుడు  మాన్యశ్రీ మద్దురి అన్నపూర్ణయ్య వారి పేరిట ఆంధ్రరాస్ట్ర ప్రభుత్వము " మద్దూరి అన్నపూర్ణయ్య ఉత్తమ జర్ణలిస్ట్ " అవార్డును ప్రతిస్టాత్మకముగా ప్రవేశపెట్టినది .
Courtesy with -- Raviteja @Swathi weekly magazine .
  • ===========================
Visit My website - > Dr.Seshagirirao