Showing posts with label వేటూరి ప్రభాకరశాస్ర్తి. Show all posts
Showing posts with label వేటూరి ప్రభాకరశాస్ర్తి. Show all posts

Saturday, February 19, 2011

వేటూరి ప్రభాకరశాస్ర్తి , Veturi Prabhakara Shastri




మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -వేటూరి ప్రభాకరశాస్ర్తి - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేదాము ....


ప్రొఫైల్ :
  • పేరు : వేటూరి ప్రభాకర శాస్త్రి ,
  • పుట్తిన తేదీ : 7 ఫిబ్రవరి 1888 ,-
  • మరణము : 29 ఆగస్టు 1950,
  • మతము : హిందు ,
  • చదువు : తెలుగు , సంస్కృతం లో పండితుడు ,
  • పిల్లలు : కొడుకు .. వేటూరి ఆనందమూర్తి ,, స్కాలర్ ,


సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్ర్తి అలాంటి ఓ సాహిత్య చరిత్రకే ప్రకాశం. ఆయన ఒట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసిన కూలీ!ఆయన ఒట్టి రచయిత కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు.

ఇంకా...
పిన్నవయసు శతావధాని, తొలితెలుగు పదం ‘నాగబు’ ఆవిష్కర్త, ‘కలికి చిలుక’ను పలికించిన కథకుడు, ‘కడుపు తీపు’, ‘దివ్యదర్శనం’, ‘మూణ్ణాళ్ల మచ్చట’, ‘కపోతకథ’ వంటి ఖండకావ్యాల విరచితుడు, విమర్శకాగ్రేసరుడు, కాలగర్భంలో కలిసిపోతున్న తెలుగు సంస్కృతీ చరిత్రను దక్షిణదేశమంతటా ఈది మరీ ఒడ్డుకు చేర్చిన సాహిత్య ఘనాపాటి.

శృంగారశ్రీనాథం, క్రీడాభిరామం, బసవపురాణం, రంగనాథ రామాయణం, తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్ర, ప్రాచీనాంధ్ర శాసనములు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, రెడ్డిరాజులు, అన్నమాచార్య కీర్తనలు, తొలితెలుగు రచయిత్రి తిమ్మక్క, తొలి తెలుగు శాసనము... ఇవన్నీ, వీరందరూ ఈరోజు మనకందుబాటులో ఉండటానికి ముఖ్యకారకుడు ఈ మహానుభావుడే!
  • ==========================
Visit My website - > Dr.Seshagirirao