Showing posts with label Tyagayya. Show all posts
Showing posts with label Tyagayya. Show all posts

Tuesday, February 8, 2011

త్యాగయ్య , Tyagayya


  • మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -త్యాగరాజస్వామి - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేదాము .
నాదస్వర బ్రహ్మ బిరుదాంకి్తుడు శ్రీ త్యాగరాజస్వామి వాగ్దేయకారులలో ప్రధమ పూజ్యస్థానము పొందినవారు . మే 4, 1767వ సంవత్సరం.. వైశాఖ శుద్ధ షష్టి నాడు ప్రముఖ వాగ్గేయకారుడు త్యాగయ్య జన్మించారు. తల్లిదండ్రులు సీతయ్య, రామబ్రహ్మం. గురువు శొంఠి వెంకట రమణయ్య. 72 మేళకర్త రాగాలలో త్యాగయ్య కృతులను రచించాడు. 2400 కీర్తనలు రచించారని పరిశోధకుల ఉవాచ. జగనానందకారక (నాటరాగం), దుడుకుగల నన్నే దొర కొడుకు బ్రోచురా (గౌళ), సాధించనే మనసా (అరభి), కనకన రుచినా (వరాళి), ఎందరో మహానుభావులు (శ్రీరాగం) అనే అయిదు కీర్తనలు ‘ఘనరాగ పంచరత్న కీర్తనలు’గా ప్రసిద్ధిగాంచాయి.

  • ‘నౌకాచరిత్ర’ ప్రహ్లాద భక్త విజయం అనే యక్షగానాలు.. వీరి ఇతర రచనలు. త్యాగరాజ కీర్తనలు లేకపోతే.. కర్ణాటక సంగీతమే లేదన్నంతగా.. వీరి కీర్తనలు పం డిత పామర జనరంజకమయ్యాయి. వీరి పూర్వీకులు కర్నూలు జిల్లా కంభం తాలూ ాలోని కాకర్ల గ్రామం నుండి తమిళ నాడులోని తిరుచానూరుకు తరలి వెళ్లారు. కాకర్ల అనే గ్రామ నామమే వీరి ఇంటిపేరుగా మారింది. ఈయన పరాభవ సంవత్సరం, పుష్య బహుళ పంచమి (జనవరి 6, 1847) నాడు మరణించారు. తిరువయ్యూరులోని వీరి సమాధిపైన బెంగళూరు నాగరత్నమ్మ అనే సంగీత విద్వాంసురాలు 1925లో దేవాలయం కట్టించింది.1940 నుండి ప్రతి సంవత్సరం దేశమంతటా పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి.

పూర్తి వివరాలు తెలుగు వికీపెడియాలో చదవంది - > త్యాగరాజస్వామి

  • =====================================
Visit My website - > Dr.Seshagirirao