Saturday, September 20, 2014

Sailaja Kiran - సైలజా కిరణ్

 •  

 •  courtesy with Eenadu vasundhara newspaper 09/2014.
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -- సైలజా కిరణ్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
 Sailaja Kiran - సైలజా కిరణ్---Courtesy with Eenadu vasundhara news paper--09/2014
మార్గదర్శి.. పొదుపుని ప్రోత్సహిస్తూ, ఆర్థిక ఆసరా అందించే తెలుగువారి ఆత్మీయనేస్తం! ఓ చిట్‌ఫండ్‌ సంస్థకి సభ్యుల నమ్మకమే ప్రాణం. పాతికేళ్లుగా ఆ విశ్వాసాన్ని ఆమె చెక్కుచెదరనివ్వకపోవడం ఒకెత్తయితే.. 'ఒక్కో ఇటుకా పేర్చి కట్టినట్టు' సంస్థని అనూహ్యంగా విస్తరించడం మరొకెత్తు! శైలజాకిరణ్‌ బాధ్యతల్ని తీసుకున్నప్పుడు మార్గదర్శి టర్నోవర్‌ వంద కోట్లు. ఇప్పుడు ఏడున్నర వేల కోట్ల పైచిలుకు! సంస్థ ఎండీగా శైలజ సాధించిన ఇన్ని విజయాల వెనుక ఓ గృహిణిగా, తల్లిగా, రామోజీరావు ఇంటి కోడలిగా ఆమె ఉద్వేగాలేమిటి? గీతం వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ అందుకున్న సందర్భంగా వసుంధర ఆమెతో మాట్లాడింది.
వ్యాపార నేపథ్యం ఉన్న కుటుంబంలో పుట్టి, అలాంటి కుటుంబంలోకే కోడలిగా అడుగుపెట్టా. ఈ రోజున ప్రముఖ చిట్‌ఫండ్‌ సంస్థ ఎండీగా నాకు చాలా గుర్తింపు వచ్చిందన్నది నిజమే! కానీ ఒకప్పుడు నా లక్ష్యం వ్యాపారం కాదు, డాక్టర్‌ కావడం. ఆరో తరగతి నుంచి మూడేళ్లు చెన్నైలోని కళాక్షేత్రలో ఉన్నా. తరవాత తొమ్మిది, పది తరగతులు విడిగా చదివా. డాక్టరు కావాలనుకుని ఇంటరులో సైన్స్‌ని ఎంచుకున్నా. ఆ రెండేళ్లూ నా ఆలోచనలన్నీ చదువు గురించే. అంతా 'పుస్తకాల పురుగు' అనేవారు. తొంభై రెండు శాతం మార్కులొచ్చాయి. కానీ నాన్‌లోకల్‌ కావడం వల్ల ఎంబీబీఎస్‌లో సీటు రాలేదు. నాకు బీఎస్సీ చేయాలనిపించలేదు. నాన్నగారు అప్పటికే రాయలసీమలో హ్యాచరీస్‌ని అభివృద్ధి చేశారు. పైగా ఇంట్లో ఇద్దరం అమ్మాయిలమే. భవిష్యత్తులో వ్యాపారం చూసుకుంటాననే స్పష్టత నాకుంది. అందుకే చెన్నైలో బీఏ లిటరేచర్‌, కోయంబత్తూరులో ఎంబీఏ చదివా.

ప్రొఫెసర్‌ కుదిర్చిన పెళ్లి...
అప్పట్లో సమాచారం తెలియాలన్నా, విజ్ఞానం పెరగాలన్నా పేపరు చదవడమే మార్గం. మా ఇంటికి 'ఈనాడు'వచ్చేది. పత్రిక చదివేదాన్ని కానీ ఆ ఇంటికే కోడలిగా వెళ్తానని ఎప్పుడూ అనుకోలేదు. నేను చదివిన ఎంబీఏ కాలేజీలో కిరణ్‌గారు నాకు రెండేళ్లు సీనియర్‌. నేను చేరేప్పటికి ఆయన చదువు పూర్తయి వెళ్లిపోయారు. మా ప్రొఫెసర్‌కి ఆయనంటే చాలా ఇష్టం. ఓసారి మా అత్తమ్మ ఫ్రొఫెసర్‌తో మాట్లాడుతూ 'మంచి అమ్మాయి ఉంటే చూడండి'అని అడిగారట. ఆమెకి నేనన్నా అభిమానమే. నా గురించి చెప్పారు. ఒకరికొకరం నచ్చడం, ఇరువైపుల పెద్దలూ మాట్లాడుకోవడం... అలా మా వివాహమైంది.
కొద్దిగా భయపడ్డా...
పెళ్లయిన కొన్ని నెలలకే మామగారు నాకు మార్గదర్శి బాధ్యతను అప్పగించారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా మొదట్లో కొద్దిగా భయపడ్డా. చిట్‌ఫండ్స్‌ అంటే లెక్కలతో, ఎంతోమంది డబ్బుతో కూడిన వ్యవహారం. చిట్ల రూపంలో డబ్బు తీసుకోవడం, దాన్ని మరొకరికి ఇవ్వడం, తిరిగి రికవరీ చేయడం.. వీటన్నిటిపై మొదట్లో నాకు అంతగా అవగాహన లేదు. క్రమంగా ఒక్కో విషయం తెలుసుకున్నా. సంస్థ ముందుకు పోవాలంటే నేనేం చేయాలీ.. అభివృద్ధి ఎక్కడ, ఎలా, ఏం చేస్తే వస్తుందీ... అని ఆలోచించా. ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా, నిదానంగా చేశా. ఇలా అనుకోగానే అలా అభివృద్ధి జరిగిపోయి, లాభాలు వచ్చేయాలని అనుకోలేదు. దేన్నీ పెద్ద సమస్యగా తీసుకోలేదు. మాట్లాడలేనేమో, చేయలేనేమో, నా వల్లకాదేమో... అన్న ఆలోచనల్ని దగ్గరికి రానీయలేదు. ఈ సానుకూల దృక్పథం, నిదానం నన్ను నిలబెట్టాయి.

పనే ప్రపంచమైంది..
మొదట్లో సాయంత్రం ఆరూ, ఆరున్నరకల్లా ఇంటికొచ్చేసేదాన్ని. కొంతకాలానికి అది ఏడున్నరయింది. బాధ్యతలు పెరిగాక రాత్రి పదీ, పదకొండుకి ఆఫీసు నుంచి బయలుదేరిన రోజులున్నాయి. ఇంటికొచ్చాక కూడా తెల్లవార్లూ పనిచేసిన సందర్భాలున్నాయి. పొద్దుటికల్లా పని పూర్తవ్వాలనుకుంటే రాత్రంతా కూర్చుండిపోయేదాన్ని. మామగారు నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. అది నా బాధ్యతను పెంచింది. ఎప్పటికప్పుడు నా పనినీ, సంస్థ అభివృద్ధినీ గమనించుకుంటూ, సమస్యలకు పరిష్కారాలు వెతుక్కుంటూ ముందుకెళ్లా. నేను వచ్చేప్పటికే మార్గదర్శికి మంచి పేరుంది. స్పష్టమైన విధానాలు ఉన్నాయి. ఉన్నత విలువల మార్గం ఉంది. అప్పుడు టర్నోవరు వందకోట్లుండి స్థిరపడిపోయింది. ఆ సమయంలో నేను బాధ్యతలు తీసుకున్నా. ప్రతి జిల్లాలో ఒకటి... కొన్నిచోట్ల రెండూ మూడూ శాఖలు ప్రారంభించడం మొదలుపెట్టా. లక్షల మందికి చేరువయ్యేలా చూశా. సంస్థలో జరిగే ప్రతి అంశానికీ ఆడిటింగ్‌ ఉండేలా చర్యలు తీసుకున్నా. వ్యాపారాన్ని అభివృద్ధి పరిచే నిపుణులైన సిబ్బంది సంఖ్యను భారీగా పెంచాం. కంప్యూటరీకరణ, ప్రతి ఒక్కటీ విశ్లేషించడం, డేటా, డాక్యుమెంట్లూ, స్క్రీనింగ్‌, రికవరీ... ఇలా ప్రతిదీ వివరణాత్మకంగా ఉండేలా చూశాం. ఎంత చిన్న శాఖ అయినా అక్కడి చిట్‌ సభ్యులకు వందశాతం సేవలందించేలా జాగ్రత్తలు తీసుకున్నాం.
సంక్షోభంలోనూ ఎదిగాం...
ఏ మాటా రాకుండా సంస్థను నడపాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నా. కానీ 2006 నవంబరులో సంక్షోభం సృష్టించారు. రాజకీయంగా సంస్థను ఇబ్బందిపెట్టే ప్రయత్నం చేశారు. అభియోగాలు తెచ్చారు. ప్రభుత్వ భరోసా ఉన్న పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకులు కూడా ఈ పరిస్థితిని తట్టుకొని నిలబడటం కష్టమే! కానీ మేం భయపడలేదు. మేం ఎలా పని చేస్తాం, ఏ రకంగా డబ్బులు చెల్లిస్తాం, మా నిజాయతీ, నిబద్ధతా, అందించే సేవలూ, పాటించే విలువలూ... అన్నీ మా సభ్యులకూ, డిపాజిటర్లకూ తెలుసు. అందుకే లక్షలాది మంది సభ్యులు నూటికి నూరుశాతం మాపై నమ్మకం ఉంచారు. ధైర్యంగా ఉన్నారు. అది ఎంతో ఆత్మవిశ్వాసాన్నిచ్చింది. ఈ సమయంలో ఉద్యోగులూ మాకు అండగా నిలిచారు. 'సంస్థకి ఏ ఇబ్బందీ రాదు, ఎప్పట్లానే మీకు మేం సేవలందిస్తాం' అని ఖాతాదారులకు భరోసా ఇచ్చారు. అందుకే ఆ సమయంలోనూ టర్నోవరు పెరిగింది. ఆ అభిమానం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం మార్గదర్శి టర్నోవరు ఏడున్నర వేల కోట్ల రూపాయలు దాటింది. ఉమ్మడి రాష్ట్రంతో పాటూ కర్ణాటక, తమిళనాడులోనూ శాఖల్ని విస్తరించాం. ప్రస్తుతం 105 శాఖలున్నాయి. ఈ సంఖ్యని 250కి చేర్చాలన్నది నా లక్ష్యం.

స్వయంగా బాధ్యత తీసుకున్నా..
నాకు ముందునుంచీ కళలంటే ఆసక్తి. అందుకే 'కళాంజలి' ప్రస్తావన వచ్చినప్పుడు నేనా బాధ్యత తీసుకుంటానని ముందుకెళ్లా. అప్పట్లో నాకెదురైన ఓ సంఘటన ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అది 1995, 96 సమయం. 'కళాంజలి'కి సంబంధించినవి కొనడానికి పశ్చిమబెంగాల్‌లోని శాంతినికేతన్‌ వెళ్లాం. తిరిగొస్తుంటే చీకటిపడింది. కారు రిపేర్‌ వచ్చి ఆగిపోయింది. అది పూర్తిగా గ్రామీణ ప్రాంతం. కారు బాగవడం కష్టం అన్నాడు డ్రైవరు. ఇంతలో ఓ బస్సు రావడంతో నేనూ, నాతో వచ్చిన అమ్మాయీ గబుక్కున ఎక్కేశాం. అది బాగా పాత బస్సు. కిక్కిరిసి ఉంది. ఎవరికీ ఇంగ్లిష్‌, హిందీ రాదు. 'కలకత్తా జానా' అని రెండు సార్లు చెప్పాక దగ్గర్లోని రైల్వే స్టేషన్‌ దగ్గర ఆపారు. అదీ చాలా చిన్న స్టేషన్‌. గొంగళ్లు కప్పుకుని కొంతమంది మగవాళ్లు అక్కడ కూర్చుని ఉన్నారు. గబాగబా వెళ్లి స్టేషన్‌మాస్టర్‌ రూంలో కూర్చుని రైలొచ్చాక ఎక్కాం. కలకత్తా చేరేసరికి తెల్లవారుజామున మూడయింది. అప్పడు సెల్‌ఫోన్లు లేవు. మా అదృష్టం కొద్దీ ఓ టాక్సీడ్రైవర్‌ మమ్మల్ని భద్రంగా హోటల్‌ దగ్గర దిగబెట్టాడు. చాలా భయమేసింది.

ఎక్కువగా వింటా...
నాన్నగారి పెంపకంలో సహనంగా ఉండటం, తొందరపడకపోవడం నేర్చుకున్నా. పెళ్లయ్యాక నిరంతరం కష్టపడి పని చేసే ఇంట్లోకే వచ్చా. దీంతో పనిలోనే ఆనందం అన్న పరిస్థితి నాకు కొత్తగా అనిపించలేదు. ఇదికాక నా ప్లస్‌పాయింట్‌ తొందరపడకపోవడం. మాట్లాడటం కన్నా ఎక్కువగా వింటా. సంస్థలో ఉన్నతోద్యోగి నుంచి అటెండర్‌ వరకూ ప్రతి ఒక్కరూ ముఖ్యమే అనుకుంటా. సానుకూలతతో, ఎప్పుడూ నవ్వుతూ ఉండటం నాకు ఇష్టం. నవ్వుతూ ఉండేవారికి భగవంతుడి ఆశీస్సులు అందుతాయి అంటారు. ఒక నిర్వాహకురాలిగా ఎదుటి వారిని నిందించడం, తప్పొప్పులు వెతకడం లాంటివి చేయను.

పిల్లలు అర్థం చేసుకున్నారు..
తల్లిగా పిల్లల్ని పొద్దున్నే నిద్రలేపడం, దగ్గరుండి వాళ్ల అవసరాలు చూడటం లాంటివన్నీ నేను చేశాను. కానీ వీలు కుదిరినప్పుడే. కొన్నేళ్ల క్రితం వరకూ పిల్లల కోసం రోజులో కేటాయించే సమయం అరగంటకు మించేది కాదు. అత్తమ్మే పిల్లల్ని చూసుకునే వారు. ఈ విషయంలో ఆమెకి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే. పిల్లలకు దగ్గరగా లేకపోయినా, వారి అవసరాలు గుర్తించి, అన్నీ సమయానికి సమకూరేలా జాగ్రత్తలు తీసుకునేదాన్ని. ఇప్పుడు మా మూడోపాప విషయంలో అన్నిటికీ వెళుతున్నాం కానీ మా పెద్దమ్మాయి సమయంలో పేరెంట్‌ టీచర్‌ మీటింగ్‌లూ, స్కూల్‌డేలకు వెళ్లడమే కుదిరేది కాదు. కొందరు పిల్లలు 'నేను వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాల్సిందే.. నువ్వు రావాల్సిందే..' అని మంకుపట్టు పట్టడం నేను చూశా. కానీ మా పిల్లలు చాలా పరిణతితో ఉండేవాళ్లు. ఏనాడూ అలగడం, నన్ను కోపగించుకోవడం, విసుక్కోవడం లాంటివి చేయలేదు. చాలా సర్దుకుపోయేవారు. అందుకే నేనీ స్థాయికి చేరుకోగలిగా. కానీ ఒక తల్లిగా వాళ్లకు చాలా తక్కువ సమయం కేటాయించాననే వెలితి మాత్రం నాకెప్పుడూ ఉంటుంది. ముగ్గురికీ సంగీతం నేర్పించాం. పెద్దమ్మాయి, మూడో అమ్మాయి చిత్రలేఖనంలో శిక్షణ తీసుకున్నారు. వ్యాపారాలున్నాయి కాబట్టి వాళ్ల తాతగారితో మాట్లాడి, ఆయన సూచన తీసుకుని భవిష్యత్తులో ఉపయోగపడే కోర్సులు చదువుతున్నారు. చదువు విషయంలో వాళ్లని నేను ఏనాడూ ఒత్తిడి చేయలేదు.

ఆయన ప్రోత్సాహమెంతో...
మావారు కిరణ్‌ నా కష్టపడే తత్వాన్ని ఎప్పుడూ గుర్తిస్తారు. నాకు ఒంట్లో ఏ మాత్రం నలతగా ఉన్నా 'ఈ రోజు ఆఫీసుకు వెళ్లొద్దు. విశ్రాంతి తీసుకో. నీ ఆరోగ్యం ముఖ్యం' అంటారు. బ్రాంచీల్ని చూడ్డానికి జిల్లాలకు వెళ్లినప్పుడూ రాత్రి ఎనిమిది తొమ్మిదింటికల్లా ఇంటికి చేరుకోవచ్చుగా అంటారు. నా మీద పెత్తనం చలాయించాలనిగానీ, తన మాటే నెగ్గాలనిగానీ అస్సలు అనుకోరు. మగవాళ్లు అనుక్షణం అజమాయిషీ చేస్తూ, కావాలని విమర్శిస్తుంటే ఆడవాళ్లు నెగ్గుకురావడం కష్టం. చాలా సందర్భాల్లో ఇద్దరం మాట్లాడుకుని ఏది మంచిదయితే అదే చేస్తాం. నా విజయాల్ని మనస్ఫూర్తిగా ప్రశంసిస్తారు. అంత పెద్ద స్థాయిలో ఉన్నా చాలా నిరాడంబరంగా ఉంటారు. ఉన్నత విలువలు పాటిస్తారు. అవి ఆయనకు జన్మతః వచ్చాయనిపిస్తుంది. అలాంటి భర్త దొరకడం నిజంగా నా అదృష్టమే.

విశ్రాంతి ఇలా...
ఎంత పని ఉన్నా పుస్తకాలు చదువుతా. రోజూ నాలుగైదు దినపత్రికలూ, మ్యాగజైన్లూ చూస్తుంటా. ఒకప్పుడు సినిమాలూ బాగా చూసేదాన్ని. ఈ మధ్యన ఏడాదికి మూడు నాలుగే చూస్తున్నా. అదీ బాగుందనుకుంటేనే. నాలుగైదేళ్లుగా వ్యాయామం, యోగా చేస్తున్నా. కామెడీ షోలూ బాగా చూస్తాను. ఇవన్నీ ఒత్తిడిని తగ్గించి, విశ్రాంతినిస్తాయి. నాకు దైవభక్తి ఎక్కువే. నా ఇష్టదైవాలు వెంకటేశ్వరస్వామి, మహాలక్ష్మి. పదిమందికి మేలు చేయడంలోనే జీవితం గడవాలనే తత్వం నాది. అందువల్లే లక్షల మంది అభిమానం పొందగలిగా. ఈ రోజున బయటికెళితే చాలామంది నన్ను పలకరిస్తారు. చిరునవ్వుతో హలో చెబుతారు. వాళ్ల నవ్వులో, పలకరింపులో ఎంతో ఆత్మీయత ఉంది. అవి నాకెంతో విలువైనవి. వెలకట్టలేనివి.
పెద్దమ్మాయ్‌ అంటారు...
సాధారణంగా మామగారు పొద్దున్నే నాలుగింటికి లేచి వాకింగ్‌ చేస్తుంటారు. ఆ పాటికే నేను కార్లో బ్రాంచీల్ని చూడ్డానికి వెళ్లిపోయేదాన్ని. ఆయన నా పని గురించి నన్ను ప్రశ్నించకపోయినా గమనిస్తూనే ఉంటారు. దాన్నెప్పుడూ గుర్తిస్తారు. అభినందిస్తారు. అదే నాకు ఇంకా బాగా, జాగ్రత్తగా, పకడ్బందీగా ఎలాంటి పొరపాటు లేకుండా పనిచేయడానికి స్ఫూర్తి. మార్గదర్శి సంక్షోభం వచ్చినా సంస్థ సాధించిన పురోగతిని గమనించారాయన. ఆ ఏడాది నా పుట్టినరోజున నాన్నగారితో కలిసి ఆశీస్సులు తీసుకుందామని మామగారి దగ్గరికెళ్లా. ఆయన ఆశీర్వదిస్తూనే 'ఇద్దరు తండ్రుల ముద్దుల బిడ్డవమ్మా' అన్నారు. ఎంత సంతోషం కలిగిందో చెప్పలేను. ఆయనెప్పుడూ నన్నూ, మా విజయేశ్వరినీ కోడళ్లుగా చూడలేదు. పెద్దమ్మాయి, చిన్నమ్మాయి అనే చెబుతుంటారు. అది నాకు ఎంతో సంతృప్తినిస్తుంది. మామగారు మా ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరినీ అత్యంత అపురూపంగా చూసుకుంటారు.

అలా చెబితే ఆనందపడ్డా...
అప్పుడు మా రెండోపాప నాలుగో పుట్టిన రోజు. పెద్దయ్యాక ఏమవుతావు అని అడిగాను. వెంటనే 'గృహిణిగా ఉండి, నా పిల్లల్నే కాదు, అక్క పిల్లల్నీ చూసుకుంటా..' అంది. అది విని, నన్ను వాళ్లెంత మిస్సవుతున్నారో కదా అనిపించింది. ఇది జరిగిన రెండేళ్లకు అమెరికాలో నాకు 'ఉమన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ ఆఫ్‌ ది ఇయర్‌' అవార్డు ఇచ్చారు. అందరూ మెచ్చుకోవడం, అభినందించడం తను చూసింది. తరవాత ఓ ఛానల్‌ వాళ్లు వచ్చి 'పెద్దయ్యాక నువ్వేమవుతావు' అని అడిగారు. వెంటనే 'బిజినెస్‌ ఉమన్‌' అంది. చాలా సంతోషంగా అనిపించింది. వాళ్లు నన్ను మిస్‌ అయినా నా కష్టాన్ని గుర్తిస్తారని అప్పుడనిపించింది. తాజాగా నాకు గౌరవ డాక్టరేట్‌ ప్రకటించాక కూడా దాన్ని అంగీకరించే ముందు పిల్లలతో మాట్లాడా. 'నువ్వెంత కష్టపడ్డావో మాకు తెలుసు.. నీకు దాన్ని తీసుకునే అర్హత ఉంది' అన్నారు.

ఒక్కో ఇటుకా పేర్చుకుంటూ..
పెళ్లయ్యాక ఒక్క పండక్కి మాత్రం పుట్టింటికెళ్లా. తరవాత సెలవులు వచ్చినప్పుడు పిల్లల్ని దింపడం, తీసుకురావడం తప్పితే నేను పట్టుమని ఓ వారం అక్కడ ఉన్నది లేదు. నాకు ఆ ధ్యాస కూడా ఉండేది కాదు. నా లక్ష్యం, నా కల, నా పనే నా ప్రపంచం. ప్రతి ఏడాది ఓ లక్ష్యం పెట్టుకునేదాన్ని. దాన్ని చేరుకునేలోగానే మరొకదాన్ని నిర్దేశించుకునేదాన్ని. నేను 1990లో బాధ్యతలు తీసుక్నుప్పుడు సంస్థ టర్నోవరు వందకోట్లు. తరవాత అది 350 కోట్లకి చేరింది. అదయ్యాక 500 కోట్లకు చేర్చాను. తరవాత వెయ్యి, రెండు వేల కోట్లు. వంద పరుగులు పూర్తయ్యాక వికెట్‌ ఇచ్చుకునే బ్యాట్స్‌మెన్‌లా ఉండాలని ఎప్పుడూ అనుకోలేదు. ఎప్పటికప్పుడు లక్ష్యాలు పెట్టుకుని సాధించడమే పని. ఇందులో నాకు ఆనందం ఉంది. లక్షల మంది ఖాతాదారుల సుస్థిర జీవితాలున్నాయి. వీటి ముందు షికార్లకు పోవాలన్న ఆలోచనలు ఏపాటివి! అయితే ఇది ఒక్క రాత్రిలో వచ్చిన ఎదుగుదల కాదు. ఇటుకపై ఇటుక పేర్చుకుంటూ వచ్చాను.
 • =========================
Visit My website - > Dr.Seshagirirao

Wednesday, August 20, 2014

A. G. Krishanamurthy,ఎ.జి.కృష్ణమూర్తి

 •  

 •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ-A.G.Krishanamurthy,ఎ.జి.కృష్ణమూర్తి- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
ముద్రా కమ్యూనికేషన్స్ (Mudra Communications) సంస్థాపక అధ్యక్షుడు ఎ. జి. కృష్ణమూర్తి (A. G. Krishanamurthy) రూ. 35 వేల నగదు తోను ఒకే ఒక క్లయింట్‌ తోను వ్యాపార ప్రకటనా సంస్థ (advertising agency) స్థాపించేరు. కేవలం తొమ్మిదేళ్ళల్లో ముద్రా భారతదేశంలో ఉన్న పెద్ద వ్యాపార ప్రకటనా సంస్థలలో మూడవ స్థానాన్ని, స్వదేశీ వ్యాపార ప్రకటనా సంస్థలలో ప్రధమ స్థానాన్ని చేరుకుంది. ప్రభుత్వంలో చిన్న గుమస్థా ఉద్యోగంతో ప్రారంభించిన ఎ. జి. కె. తెలుగువారు గర్వించదగ్గ అతి ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ధీరూభాయ్ అంబానీకి అతి చేరువలో ఉండి ఈ సంస్థని ఇంత త్వరగా ఉన్నత స్థాయికి లేవనెత్తి ఆయనచేత శభాష్ అనిపించుకున్నారు. ఈయన అనుభవాలని పుస్తకాల రూపంలోనూ, పత్రికా శీర్షికల ద్వారానూ రాసి యువతని ఉత్తేజ పరుస్తున్నారు. కృష్ణమూర్తి తెలుగు పత్రికలో వారం వారం అనే శీర్షికను, ఆంగ్ల పత్రికలలో ఏజికె స్పీక్ (AGK Speak) అనే శీర్షికను వ్రాస్తుంటాడు.

కృష్ణమూర్తి 1942, ఏప్రిల్ 28న గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించాడు. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి చరిత్రలో బి.ఏ హానర్స్ పట్టాపుచ్చుకొని 1968లో 60, 70వ దశకాలలో వస్త్ర పరిశ్రమలో బాగా పేరున్న కాలికో మిల్స్లో గిరాబెన్ సారాభాయికి సహాయకుడిగా చేరాడు. 1972లో అదే కంపెనీకి చెందిన వ్యాపార ప్రకటనాసంస్థ అయిన శిల్పా అడ్వర్టైజింగ్ లో అకౌంట్ ఎగ్జిక్యూటివ్ గా పదవోన్నతి పొందాడు. 1976లో రిలయన్స్ సంస్థలకు ఆడ్వర్టైజింగ్ మేనేజరుగా చేరి, నాలుగు సంవత్సరాలు తిరక్కుండానే సొంత వ్యాపార ప్రకటనా సంస్థ ముద్రా కమ్యూనికేషన్స్ ను 1980, మార్చి 25న స్థాపించాడు.
ముద్రా కమ్యూనికేషన్స్ చైర్మన్‌గా పదవీ విరమణ చేసిన తర్వాత ఎ.జి.కె. బ్రాండ్ కన్సల్టింగ్‌ను స్థాపించారు. కాలమిస్టుగా, రచయితగా ఆంగ్లంలోనూ, తెలుగులోనూ పలు వ్యాసాలు, పుస్తకాలు ప్రచురించారు. వారి పుస్తకాలు అతి కొద్దికాలంలో పలు భారతీయ భాషల్లో ప్రచురింపబడి, ఎంతో మందికి స్ఫూర్తినిచ్చి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. ప్రస్తుతం వీరి నివాసం హైదరాబాదు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు.

 • Awards :
ఎ.ఎ.ఎ.ఐ - ప్రేం నారాయణ్ అవార్డు,1999.
ఇంటర్నేషనల్ హూ ఈజ్ యు ఆఫ్ ప్రొఫెషనల్స్ 2002-2003 ఎడిషన్‌లో స్థానం.
2003లో మా టీవి సన్మానం.

 • courtesy with Wikepedia.org

 • =============================
Visit My website - > Dr.Seshagirirao

Tuesday, August 19, 2014

Makineedi Surya Bhaskar-మాకినీడి సూర్య భాస్కర్

 •  

 •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Makineedi Surya Bhaskar-మాకినీడి సూర్య భాస్కర్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....కవితా చిత్రకారుడు మాకినీడి-- శ్రీ మాకినీడి సూర్య భాస్కర్ పేరెన్నిక గల కవి, విమర్శకుదు మరియు చిత్రకారుదు. ఈయన 1962, ఆగస్ట్ 17న కాకినాడలొ మాకినీడి శ్రీరంగనాయకులు , శ్రీమతి సరస్వతి దంపతులకు జన్మించారు. తొమ్మిదవ తరగతి చదువుతున్న కాలం లొనే 'సుమ కవితాంజలి ' అనే ఖండ కావ్యాన్ని రాశారు. తరువాత కాలంలొ దీనిని తిరుమల తిరుపతి దేవస్థానం వారు పుస్తక రూపేణా అచ్చు వేయించారు. జీవిత భాగస్వామి మనసెరిగి మసలుకునే అనుకూలవతి శ్రీమతి సుభద్ర.

ఈయన వృత్తి అధ్యాపకత్వం. ఆంగ్ల ఉపాధ్యాడు. ప్రవృత్తి సాహిత్యం, చిత్రలేఖనం. అంటే కలం పట్టుకుని ఒక వైపు భావ చిత్రాలు రచిస్తూనే, మరొ పక్క కుంచెతొ విన్యాసాలు చేసే సత్తా ఉన్న కళాకారునిగా మనకు కనిపిస్తారు. ఈయన యాభై జలవర్ణ చిత్రాలు, ఇరవై మినీయేచర్లు గీయడమే కాకుండా కళా విమర్శక వ్యాసాల సంపుటి 'కళాతొరణం' (తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ) కూడా వెలువరించారు.

 • =====================
Visit My website - > Dr.Seshagirirao

Monday, July 28, 2014

Matsa Santhoshi weight lifting,మత్స సంతోషి మహిళల వెయిట్‌లిఫ్టింగ్

 •  

 •  
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Matsa Santhoshi weight lifting,మత్స సంతోషి మహిళల వెయిట్‌లిఫ్టింగ్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

 జిల్లాలో ఓ మారుమూల గ్రామంలో పుట్టిన క్రీడా కుసుమం ..ఆమె పోటీలో అడుగుపెట్టిందంటే చాలు.. పతకం దక్కాల్సిందే.. అది జాతీయ క్రీడలైన, అంతర్జాతీయ క్రీడలైనా.. ఆమెకు సునాయసమే. ఆమె ఎవరో కాదు... నెల్లిమర్ల మండలం కొండవెలగాడ గ్రామానికి చెందిన మత్స సంతోషి.. 20వ కామనె్వల్త్ క్రీడల్లో మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 53 కిలోల విభాగంలో పాల్గొని కాంస్యం దక్కించుకొని దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసింది. దీంతో జిల్లా అంతటా ఆమె అభిమానులు, నేతలు ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. శనివారం మంత్రి మృణాళిని ఆ గ్రామానికి వెళ్లి సంతోషి తల్లిదండ్రులతో కాసేపు ముచ్చటించారు. పేదరికంలో పుట్టినప్పటికీ సాహసమే ఊపిరిగా ఎదిగింది. కోచ్ చల్లా రాము సూచనలతో ముందడుగు వేసింది. ఆమె సాధించిన పతకాలు చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగక మానదు. 2005 నుంచి పలు అంతర్జాతీయ క్రీడా పోటీల్లో బంగారు పతకాలను సాధించింది. 2006-13 వరకు జాతీయ స్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో జూనియర్ విభాగంలో పలుమార్లు బంగారు పతకాలను సాధించి ఛాంపియన్‌గా నిలిచింది. 2010లో ఉజ్బెకిస్తాన్‌లో జరిగిన ఏషియాడ్‌లో బంగారు పతకాన్ని సాధించింది. అదే ఏడాది సింగపూర్‌లో జరిగిన యూత్ ఒలింపియాడ్‌లో ఐదో స్థానం దక్కించుకుంది. మలేషియాలోని కామన్‌వెల్త్ యూత్ జూనియర్ చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. 2011లో దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరిగిన చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకం సాధించింది. 2012లో మలేషియాలో జరిగిన జూనియర్ విభాగంలో బంగారు పతకం దక్కించుకుంది. ఇక జాతీయ స్థాయి క్రీడా వేదికలలో అనేకమార్లు బంగారు పతకాలను కైవశం చేసుకుంది. ఈ విధంగా సంతోషి గత పదేళ్లుగా కొండవెలగాడ గ్రామం పేరును అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిందనడంలో ఎటువంటి సందేహం లేదు.

స్కాట్లాండ్‌లోని  గ్లాస్గోలో జరుగుతున్న కామన్‌వెల్త్ క్రీడల్లో దేశం నుంచి వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో ప్రాతినిధ్యం వహించిన  తెలుగు తేజం మత్స సంతోషికి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. పోటీల్లో 53 కిలోల విభాగంలో దేశం నుంచి ప్రాతినిధ్యం వహించిన సంతోషి క్లీన్ అండ్ జర్క్‌లో 105 కేజీలు, స్నాచ్ లో 83 కేజీలు బరువులు ఎత్తి కాంస్య పతకం దక్కించుకు న్న విషయం విదితమే. సంతోషి సాధించిన ఘనత ద్వారా జిల్లా ఖ్యాతి ఎల్లలు దాటాయని పలు క్రీడాసంఘాలు అభినందనలు వ్యక్తం చేస్తున్నాయి. సంతోషికి అభినందనలు తెలిపిన వారిలో జిల్లా క్రీడాభివృద్ధి అధికారి కె. మనోహర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన అయ్యలు, కార్యదర్శి సిహెచ్.వేణుగోపాలరావు, జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు దన్నాన తిరుపతిరావు,  వల్లూరి చారిటబుల్ ట్రస్టు అధ్యక్షులు వల్లూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి సముద్రాల గురుప్రసాద్, జిల్లా వెయిట్ లిఫ్టింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు గురాన సాధూరావు, కార్యదర్శి అట్టాడ లక్ష్మున్నాయుడుతో పాటు వివిధ క్రీడా సంఘాల ప్రతి నిధులు, క్రీడాభిమానులు ఉన్నారు.

 వ్యాయూమశాల పూర్తికి నిధులిస్తాం..
వెయిట్ లిఫ్టింగ్ క్రీడకు పుట్టినిల్లయిన కొండ వెలగాడలో నిర్మాణంలో ఉన్న వ్యాయామశాలను పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేస్తామని పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి హామీనిచ్చారు. కామన్వెల్త్ క్రీడల్లో గ్రామానికి చెందిన మత్స సంతోషి కాంస్య పతకం సాధించిన సందర్భంగా ఆమె తల్లిదండ్రులు రాములమ్మ, రామారావులను కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం సత్కరించారు. కొండవెలగాడలోని సంతోషి స్వగృహానికి చేరుకుని అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం తన నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి కొండవెలగాడలోని వ్యాయామశాల నిర్మాణానికి నిధులు విడుదల చేసేందుకు ముందుకొచ్చినట్లు తెలిపారు. భవిష్యత్తులో సంతోషి మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. పార్టీ నేతలు బొత్స సత్యనారాయణ, బొత్స ఝాన్సీలక్ష్మి, బడ్డుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పలనరసయ్య, యడ్ల రమణమూర్తి, ఆదిరాజు పాల్గొన్నారు.

 • ========================
Visit My website - > Dr.Seshagirirao

Saturday, April 5, 2014

Ganteda Gaurunaidu - Writer,గంటేడ గౌరునాయుడు-రచయిత

 •  
 •  

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -గంటేడ గౌరునాయుడు-రచయిత - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


కండగల, కన్నుగల కథకుడు గంటేడ గౌరునాయుడు
ఉత్తరాంధ్రలో కొనసాగుతోన్న ఒక సాహితీ సాంస్కృతిక పరంపరకు నేటి తరంలో ప్రతినిధులెవరు? అన్న ప్రశ్న వేసుకోవలసిన అవసరం ఉందా? అంటే ీలేదు' అన్నదే సరైన సమాధానం. ఎందుకంటే ఉత్తరాంధ్రలోనే కథ పుట్టిందీ, ఇప్పటికీ అక్కడే వెలుగుతోందీ. అటువంటప్పుడు ప్రతినిధిగా ఒక్కరిని చూపడం భావ్యంకాదు. అయితే గురజాడ తర్వాత చాసో, రావిశాస్త్రి, బలివాడ, పూసపాటి, దాట్ల, భూషణం, కారామాష్టారు, పంతుల జోగారావు, పతంజలి, శ్రీపతి, అట్టాడ అప్పల్నాయుడు, గంటేడ గౌరునాయుడు, బమ్మిడి జగద్వీరరావు... ఇలా ఆ జాబితా అనంతం. జాబితా మాత్రమే తయారుచేయవలసి వస్తే ఇంకా అనేక మంది చేరుతారు. అయితే ీుకండగల'' రచయితల జాబితా తయారు చేస్తే మాత్రం ఇలా... ఈ పేర్లు తప్పక నిలుస్తాయి. గిరిజన రైతాంగ యోధుల క్షతగాత్ర గానంనుంచీ, జమీందారీ వ్యతిరేక పోరాటాలనుంచీ, కోస్తా దాడులనుంచీ, వ్యవసాయక విప్లవ సారథ్యంనుంచీ గొంతెత్తి, తమ నేలతల్లికోసం, విముక్తికోసం సామూహిక గానంచేస్తోన్న గంటేడ గౌరునాయుడి స్వరం తప్పక వినిపిస్తుంది. హంగూ, ఆర్భాటమూ లేకుండా, నేల పొత్తిళ్లలోంచి, తలెత్తి, చిరుగాలికి పులకించే మొలకల్లా, గౌరనాయుడూ, గౌరునాయుడు కథలూ ఉంటాయి -'' ఈ మాటలన్నది మరెవరో కాదు... ఎవరైతే గౌరునాయుడి సాహితీ సృజనకు స్ఫూర్తిగా నిలిచారో ఆ అప్పలనాయుడే. ఈ గౌరునాయుడ్ని దగ్గరగా, సహచరుడిగా, స్నేహితుడిగా యెరిగిన నేను అతనిని గ్రామీణ జానపద కథకుడిగానూ, మంచినికోరే రచయితగానూ ప్రాంతీయ ఆర్థిక, సామాచ్కీజిజిక చ్కీజీజివిత చిత్రకారుడిగానూ - అతని కథల ద్వారా అర్థం చేసుకున్నాను -'' అదీ గంటేడ గురించి!

1954 ఆగస్టు ఏడో తేదీ విజయనగరం జిల్లా కొమరాడ మండలం, దళాయిపేటలో సోములమ్మ, సత్యంనాయుడు దంపతులకు జన్మించిన గౌరునాయుడు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎ. పట్టా పొందారు. ఆ తర్వాత బిఇడి చేశారు. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే 1983లో శారదపెళ్లి'' అనే కథ రాశారు. కథ రాయాలన్న ఉద్దేశంతో ఆ కథ రాశారు. ఆ మాటకొస్తే 1989 వరకు రాసిన కథలన్నీ అటువంటివే. సామాజిక అవగాహనతో, తన ప్రాంత ప్రజల పట్ల ఆర్తితో, వారిపట్ల తన కర్తవ్య నిర్వహణతో రాయడం మొదలుపెట్టింది మాత్రం 1989లోనే. అలా రాసిన తొలికథ  '' స్త్రీ విముక్తి'' తానెందుకు అలా చెప్పుకుంటాడో ఆయన మాటల్లోనే-'' కారా, రావిశాస్త్రి, చా.సో, భూషణం గార్ల కథల పరిచయంతో పాటు 1988లో అప్పల్నాయుడి పోడు-పోరు' కథల సంపుటి ప్రధానంగా నన్ను మలుపుతిప్పాయి... నిజమే! ఏ రచయితకైనా సరైన లక్ష్యం, గురి కుదిరేంతవరకు దారి సరిగా ఉండదు. ఒక్కసారి తానేమిటో, తను ఎవరికోసం రాయాలో, ఎందుకు రాయాలో తెలుసుకొన్న తర్వాత ఆ రచనలు పదునుగానే కాదు, భిన్నంగానూ ఉంటాయి. కథకుడిగా కలంగేట్రం  చేసిన అయిదారు సంవత్సరాలకి ఇవి తెలుసుకొన్న గంటేడ గౌరునాయుడు ఆ తర్వాత పక్కదారులు పట్టలేదు. ఒక దశాబ్దకాలంలోనే మేజర్‌ రచయిత అయ్యారు. ఉత్తరాంధ్రకు ప్రతినిధిగా మారారు.

భూమిపుండు, ఏటిపాట, బతుకాకు, ఒకరాత్రి - రెండుస్వప్నాలు, చ్కీజీజివన్మృతులు, విముక్తి, నీటిముల్లు, నరాలు తెగుతున్ననేల, బడిసాల, అవతలిఒడ్డు, కొండమల్లె, రాగాలచెట్టు, రక్తాశ్రువు, రంగురంగుల చ్కీచీజికట్లోకి, తిరుగుడుగుమ్మి, భూమివుండు, చ్కీజీజివసూత్రం... ఇలా అనేక కథలు కల్పితాలు కావు. ఆయా కాలాల్లో ఆయా ప్రాంతాల్లో చెదరిన చ్కీజీజివితాల సారాంశమే అది! ఛిద్రమైన జీవితాల అడుగులే అవి, బలైన మనుషుల పొలికేకలే అవి, ఆర్తుల ఆక్రందనలే అవి!

గౌరునాయుడు తన చుట్టూ ఉన్న జీవితాల్ని అసహ్యించుకోలేదు. వాటినుంచి పారిపోవాలనీ అనుకోలేదు. వాటినుంచి తానూ, తనతోపాటు అందరూ ఎదగాలని ఆకాంక్షించారు. ఆ ప్రాంతాన్ని నిండుగా ప్రేమించారు. అక్కడ చోటుచేసుకొన్న, ఇంకా చోటుచేసుకుంటోన్న అవాంఛనీయ పరిణామాలను చూసి ఉగ్రుడయ్యారు; వాటిని నిలదీస్తున్నారు; వాటికి కారకులైన వారిని ప్రశ్నిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో అవసరమైనపుడు ద్వేషిస్తున్నారు కూడా. అందుకే ఆయన కళింగాంధ్ర ఉచ్ఛ్వాస నిశ్వాసాలు గుర్తెరిగిన రచయిత అయ్యారు; వాటిని బలంగా వ్యక్తం చేయగలిగిన రచయిత అయ్యారు. ఒక రావిశాస్త్రి, ఒక కా.రా. వంటి వారికి ఇష్టుడయ్యారు.

గౌరునాయుడులో కథకుడు, కవి కలసి ఉన్నారు. 1997లోఏటిపాట'' కథల సంపుటి ప్రచురించిన నాయుడు 98 లో పాడుదమా స్వేచ్ఛగీతం, 2001లో కళింగోర', 2002 నాగేటి చాలుకు నమస్కారం, 2004లో రవీంద్ర గీతాంజలి, 2005 ప్రియ భారత జననీ' వంటి పాటల సంకలనాలు ప్రచురించారు. చాసో స్ఫూర్తి సాహిత్య పురస్కారం, జ్యేష్ఠ లిటరరీ పురస్కారం, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం, విశాల సాహితి పురస్కారం అందుకొన్న నాయుడిది కవితాత్మక శైలి. అప్పల్నాయుడి మాటల్లో చెప్పాలంటే - వాతావరణాన్నీ, పాత్రల్నీ, కవితాత్మకంగా వర్ణించే వాక్యాలు గౌర్నాయుడి శైలి... ఏ కథలోనైనా... సహజాతి సహజ వాతావరణంలో పాఠకుడు నడుస్తాడు. ఉపమానాలు కవితాత్మక వాక్యాలు సందర్భానికి అతికినట్టుగాదు, సందర్భంలో ఉద్భవించి నట్టుంటాయి...'' నిజమే ప్రతికథ ప్రారంభం ఎంత అద్భుతంగా మొదలవుతుందో, ముగింపూ అంతే గాఢతతో, జీవనానుభవ సారంతో ముగుస్తుంది. పాఠకుల మనసుల్ని ఆలోచనల్లో పడవేస్తుంది. మనస్సున్న వారిని ఒకచోట కుదురుగా ఉండనీయక కలవరపెడుతుంది. కథకుడిగా గౌరునాయుడి విజయరహస్యం ఇదే!

 • -చీకోలు సుందరయ్య@ ఈనాడు సాహిత్యము

 • ============================
Visit My website - > Dr.Seshagirirao

Monday, March 24, 2014

Janammadi hanumachastry,జానమద్ది హనుమచ్ఛాస్త్రి

 •  
 •  image : courtesy with Swati Telugu weekly.

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -జానమద్ది హనుమచ్ఛాస్త్రి- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


జానమద్ది హనుమచ్ఛాస్త్రి తెలుగులో ఒక విశిష్టమైన బహు గ్రంథ రచయిత. జానమద్ది కథా రచనే కాకుండా వివిధ పత్రికలలో, సంచికలలో 2,500 పైగా వ్యాసాలు రాసాడు. 16 గ్రంథాలు వెలువరించాడు. మా సీమకవులు, నాట్యకళాప్రపూర్ణ బళ్ళారి రాఘవ జీవిత చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం 2, కడప సంస్కృతి- దర్శనీయ స్థలాలు, రసవద్ఘట్టాలు, మన దేవతలు, భారతరత్న మోక్షగుండం విశ్వేశ్వరయ్య జీవిత చరిత్ర, సి.పి.బ్రౌన్ చరిత్ర మొదలైన గ్రంథాలు ప్రచురించాడు.


 • జన్మ నామం --    జానమద్ది హనుమచ్ఛాస్త్రి,
 • జననం --    సెప్టెంబరు 5, 1926,అనంతపురం జిల్లా రాయదుర్గం,
 • మరణం --    ఫిబ్రవరి 28, 2014 (వయసు 87)
 • ఇతర పేర్లు--     జానమద్ది హనుమచ్ఛాస్త్రి,
 • ప్రాముఖ్యత --    విశిష్టమైన బహు గ్రంథ రచయిత.
 • వృత్తి --    ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయుడు,


1946లో బళ్ళారి లోని ప్రభుత్వ పాఠశాలలో సెకండరీ గ్రేడు ఉపాధ్యాయునిగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కడప లో సి.పి.బ్రౌన్ స్మారక గ్రంథాలయ ట్రస్టును నెలకొల్పి, దాని కార్యదర్శిగా అహర్నిశలూ పాటుపడి 10 లక్షల రూపాయల విరాళాలు సేకరించాడు. వీరి కృషితో అది వాస్తవ రూపం ధరించింది. ఈ కేంద్రానికి 15 వేల గ్రంథాలను శాస్త్రి సేకరించి, బ్రౌన్ ద్విశతి మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించాడు.


శాస్త్రి కి అనేక అవార్డులు లభించాయి. గుంటూరులో అయ్యంకి వెంకటరమణయ్య అవార్డు,
అనంతపురం లలిత కళా పరిషత్ అవార్డు,
ధర్మవరం కళాజ్యోతి వారి సిరిసి ఆంజనేయులు అవార్డు,
కడప సవేరా ఆర్ట్స్ వారి సాహితీ ప్రపూర్ణ అవార్డు,
మదనపల్లి భరతముని కళారత్న అవార్డు,
తెలుగు విశ్వవిద్యాలయ ప్రతిభా పురస్కారం,
బెంగళూరులో అఖిల భారత గ్రంథాలయ మహాసభ పురస్కారం.................... వంటి అనేక పురస్కారాలు వీరికి లభించాయి.

కడపలోని రిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 28-ఫిబ్రవరి-2014 న వీరు పరమపదించారు.
 • ================================
Visit My website - > Dr.Seshagirirao

Sunday, February 23, 2014

Justice Nuthalapati Venkata Ramana,జస్టిస్ నూతలపాటి వెంకట రమణ

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -జస్టిస్ నూతలపాటి వెంకట రమణ- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
 •  
 •  

 జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ న్యాయ నిపుణులు మరియు న్యాయమూర్తి.అత్యున్నత కోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం సోమవారం (Monday, 24 February, 2014)తర్వాత ప్రమాణ స్వీకారం ఏడేళ్లపాటు జస్టిస్‌గా బాధ్యతలు ఆపై 16 నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా పదవి! కోకా సుబ్బారావు తర్వాత చీఫ్ జస్టిస్ కానున్న తెలుగు తేజం.

హైదరాబాద్, ఫిబ్రవరి 8: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీం న్యాయమూర్తిగా నియమిస్తూ శుక్రవారం రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు వెలువరించింది. ఆయన 2021 ఏప్రిల్ 23వ తేదీ వరకు సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. అప్పటికి సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో ఆయనే అత్యంత సీనియర్ అవుతారు. 2021 ఏప్రిల్ 24వ తేదీ నుంచి పదవీ విరమణ వరకు... సుమారు 16 నెలలపాటు భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించే అవకాశముంది. అప్పుడెప్పుడో 47 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు బాధ్యతలు నిర్వహించారు. ఆయన తర్వాత ఈ అత్యున్నత పదవి అందుకోనున్న తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ మాత్రమే కావడం గమనార్హం. సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ రమణ సోమవారం తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నారు. • ====================
 Visit My website - > Dr.Seshagirirao