జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ న్యాయ నిపుణులు మరియు న్యాయమూర్తి.అత్యున్నత కోర్టులో న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వీ రమణ నియామకం సోమవారం (Monday, 24 February, 2014)తర్వాత ప్రమాణ స్వీకారం ఏడేళ్లపాటు జస్టిస్‌గా బాధ్యతలు ఆపై 16 నెలలపాటు ప్రధాన న్యాయమూర్తిగా పదవి! కోకా సుబ్బారావు తర్వాత చీఫ్ జస్టిస్ కానున్న తెలుగు తేజం.
హైదరాబాద్, ఫిబ్రవరి 8: సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంకటరమణ నియమితులయ్యారు. ప్రస్తుతం ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ ఎన్వీ రమణను సుప్రీం న్యాయమూర్తిగా నియమిస్తూ శుక్రవారం రాష్ట్రపతి భవన్ ఉత్తర్వులు వెలువరించింది. ఆయన 2021 ఏప్రిల్ 23వ తేదీ వరకు సుప్రీంకోర్టు జడ్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. అప్పటికి సుప్రీం కోర్టు న్యాయమూర్తుల్లో ఆయనే అత్యంత సీనియర్ అవుతారు. 2021 ఏప్రిల్ 24వ తేదీ నుంచి పదవీ విరమణ వరకు... సుమారు 16 నెలలపాటు భారత సర్వోన్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహించే అవకాశముంది. అప్పుడెప్పుడో 47 సంవత్సరాల క్రితం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ కోకా సుబ్బారావు బాధ్యతలు నిర్వహించారు. ఆయన తర్వాత ఈ అత్యున్నత పదవి అందుకోనున్న తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ మాత్రమే కావడం గమనార్హం. సుప్రీం న్యాయమూర్తిగా జస్టిస్ రమణ సోమవారం తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నారు.
- పూర్తిసమాచారము కోసం ఈ క్రింది లింక్ ను క్లిక్ చేయండి...జస్టిస్ నూతలపాటి వెంకట రమణ
- ====================
No comments:
Post a Comment