Showing posts with label త్రిపురనేని గోపీచంద్. Show all posts
Showing posts with label త్రిపురనేని గోపీచంద్. Show all posts

Wednesday, November 23, 2011

త్రిపురనేని గోపీచంద్,Tripuraneni Gopichand





మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --త్రిపురనేని గోపీచంద్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

ప్రముఖ తెలుగు రచయిత, హేతువాది నాస్తికుడు , సాహితీవేత్త మరియు తెలుగు సినిమా దర్శకుడు . గోపీచంద్ 1910, సెప్టెంబర్ 8 న కృష్ణా జిల్లా అంగలూరు గ్రామములో జన్మించాడు. ఈయన తండ్రి ప్రముఖ సంఘ సంస్కర్త త్రిపురనేని రామస్వామి. గోపీచంద్ తన జీవితంలో చాలా సంఘర్షణను అనుభవించాడు.అనేక వాదాలతో వివాదపడుతూ, తత్వాలతో దాగుడుమూతలాడుతూ, సంతృప్తిలోనూ అసంతృప్తిలోనూ ఆనందాన్నే అనుభవిస్తూ జీవయాత్ర కొనసాగించాడు. తన తండ్రినుంచి గోపీచంద్ పొందిన గొప్ప ఆయుధం,ఆస్తి,శక్తి ఎందుకు? అన్న ప్రశ్న. అది అతన్ని నిరంతరం పరిణామానికి గురిచేసిన శక్తి. అతనిలోని అరుదైన, అపురూపమైన, నిత్యనూతనమైన అన్వేషణాశీలతకి ఆధారం. ఎందుకు? అన్న ప్రశ్ననే అతన్ని ఒక జిజ్ఞాసువు గా,తత్వవేత్త గా నిలబెట్టింది. ఈ క్రమంలో అతనిలో చెలరేగిన సంఘర్షణ అతని నవలలన్నింటిలోనూ ప్రతిఫలించింది.

గోపీచంద్ రచనలలో విలువల మధ్య పోరాటం ముఖ్యముగా చెప్పుకోతగినది. ఆయన రాసిన అసమర్థుని జీవయాత్ర తెలుగులో మొదటి మనో వైజ్ఞానిక నవల. 1963లో పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా కు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది

పూర్తి వివరాలకు --> త్రిపురనేని గోపీచంద్,Tripuraneni Gopichand
  • ======================================
Visit My website - > Dr.Seshagirirao