మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -గురజాడ అప్పారావు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
గురజాడ అప్పారావు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప సాహితీకారులలో ఒకడు.హేతువాది 19 వ శతాబ్దంలోను, 20 వ శతబ్ది మొదటి దశకంలోను ఆయన చేసిన రచనలు ఈనాటికీ ప్రజల మన్ననలను పొందుతున్నాయి. రాశిలో తక్కువైనా, ఆయనవి వాసికెక్కిన రచనలు. వ్యావహారిక భాషలో రచనలు చేయడం తప్పుగానూ, చేతకానితనం గాను భావించే ఆ రోజుల్లో ఆయన ప్రజలందరికీ అర్ధమయ్యే జీవ భాషలో రచనలు చేసాడు
జీవిత విశేషాలు
గురజాడ అప్పారావు కుటుంబం వారి తాతల కాలంలో కృష్ణా జిల్లా గురజాడ గ్రామం నుండి విశాఖ మండలానికి వలస వచ్చింది. విశాఖపట్నం జిల్లా ఎలమంచిలి తాలూకా రాయవరం (ఎలమంచిలి) గ్రామంలో 1862 సెప్టెంబర్ 21 వ తేదిన అప్పారావు మతామహుల ఇంట జన్మించారు.. తండ్రి వెంకట రామదాసు, తల్లి కౌసల్యమ్మ. చీపురుపల్లి లో పదేళ్ళ వరకు చదివాడు. విజయనగరంలో బి.ఏ చదువుతున్నపుడు వాడుక భాషా ఉద్యమ నాయకుడు గిడుగు రామమూర్తి ఆయనకు సహాధ్యాయి. వారిద్దరూ ప్రాణస్నేహితులు. ప్రతి ఏటా గురజాడ జన్మదిన వేడుకను రాయవరం ప్రజలు ఘనంగా నిర్వహిస్తారు.
మహాకవీ... మన్నించు!
ఆధునిక సాహిత్య దినోత్సవంగా గురజాడ అప్పారావు జయంతి(సెప్టెంబరు 21)ని ఏటా నిర్వహించనున్నట్లు రవాణాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. బుధవారం విజయనగరంలో గురజాడ 150వ జయంతి ఉత్సవాలు ఆర్భాటంగా ప్రారంభమయ్యాయి. వీటిలో బొత్సతో పాటు సాంస్కృతిక శాఖ మంత్రి వట్టివసంతకుమార్ పాల్గొన్నారు. సాయంత్రం 4 గంటలకు గురజాడ స్వగృహంలో ఆయన చిత్రపటం వద్ద మంత్రులు, విజయనగరం ఎంపీ బొత్స ఝాన్సీ, కలెక్టరు ఎం.వీరబ్రహ్మయ్య తదితర అధికార, అనధికార ప్రముఖులు జ్యోతి వెలిగించి నివాళులు అర్పించారు. గురజాడ రచనలలోని పాత్రల ఔచిత్యాన్ని హావభావాలతో ఇంటర్ విద్యార్థిని ప్రవల్లిక నారాయణ వేసిన 18 తైలవర్ణ చిత్రాలను మంత్రులు ఆవిష్కరించారు. తరువాత మహారాజ కళాశాల సమీపంలో ఉన్న గురజాడ అప్పారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. రూ.కోటితో గురజాడ కళాభారతిలో ఆడిటోరియం ఆధునికీకరణకు శిలాఫలకం వేశారు. అక్కడ జరిగిన సభా కార్యక్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ గురజాడ రచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. కళలకు కాణాచి అయిన విజయనగరంలో వచ్చే ఏడాది నంది నాటకోత్సవాల ఏర్పాటుకు కృషి చేస్తామని బొత్స హామీ ఇచ్చారు. ఈ ఉత్సవాలను హైదరాబాదులో కూడా వేడుకగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వెయ్యి పేజీలతో గురజాడ సాహితీ సర్వస్వం గ్రంథాన్ని ఈ నెల 21న హైదరాబాదులో ఆవిష్కరించనున్నట్లు చెప్పారు. గురజాడ రచనల ఔన్నత్యాన్ని తెలియజేస్తూ ప్రముఖ నాటక రచయిత, నటుడు ఎ.బి.సుబ్బారావు రచించిన 'తెలుగుజాతి మహోదయం' నృత్యరూపకాన్ని నర్తనశాల విద్యార్థులు రసవత్తరంగా ప్రదర్శించారు. తరువాత మహాకవి గురజాడ విరచిత కరుణరసాత్మక 'పుత్తడి బొమ్మ పూర్ణమ్మ' రూపకాన్ని రవికుమార్ బృందం మనోహరంగా ప్రదర్శించి గురజాడ మనోభావాలను కళ్లకుకట్టారు. అనంతరం రాష్ట్ర సాంస్కృతిక మండలి నిర్వహణలో హైదరాబాదు నుంచి వచ్చిన కళాకారులతో 'గురజాడ దర్బార్' కళారూపాన్ని ప్రదర్శించారు.
for more datails ->Gurajada apparao @ wikipedia
- =======================