- మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -త్యాగరాజస్వామి - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేదాము .
- ‘నౌకాచరిత్ర’ ప్రహ్లాద భక్త విజయం అనే యక్షగానాలు.. వీరి ఇతర రచనలు. త్యాగరాజ కీర్తనలు లేకపోతే.. కర్ణాటక సంగీతమే లేదన్నంతగా.. వీరి కీర్తనలు పం డిత పామర జనరంజకమయ్యాయి. వీరి పూర్వీకులు కర్నూలు జిల్లా కంభం తాలూ ాలోని కాకర్ల గ్రామం నుండి తమిళ నాడులోని తిరుచానూరుకు తరలి వెళ్లారు. కాకర్ల అనే గ్రామ నామమే వీరి ఇంటిపేరుగా మారింది. ఈయన పరాభవ సంవత్సరం, పుష్య బహుళ పంచమి (జనవరి 6, 1847) నాడు మరణించారు. తిరువయ్యూరులోని వీరి సమాధిపైన బెంగళూరు నాగరత్నమ్మ అనే సంగీత విద్వాంసురాలు 1925లో దేవాలయం కట్టించింది.1940 నుండి ప్రతి సంవత్సరం దేశమంతటా పుష్య బహుళ పంచమి నాడు త్యాగరాజ ఆరాధనోత్సవాలు జరుగుతాయి.
పూర్తి వివరాలు తెలుగు వికీపెడియాలో చదవంది - > త్యాగరాజస్వామి
- =====================================
No comments:
Post a Comment