Thursday, February 10, 2011

దత్తాత్రేయుడు నోరి డా. , Dattatreyudu Nori Dr.




మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -దత్తాత్రేయుడు నోరి డా.(Dattatreyudu Nori Dr.)- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేదాము ....


మహిళలలో వచ్చే క్యాన్సర్ వ్యాధులను నయం చేయడం లొ సిద్ధహస్తులు డా. దత్తాత్రేయుడు నోరి . కొన్నేళ్ళ క్రితం దివంగత ఎన్‌.టి.ఆర్. సతీమణి క్యాన్సర్ చికిత్సకు అమెరికా వెళ్లినపుడు ఆయన చేసిన చిన్న విజ్ఞప్తి హైదరాబాద్ లో " బసవతారకం ఇండో-అమెరికన్‌ క్యాన్సర్ ఇస్టిట్యూట్ " కు జన్మనిచ్చినది . ఎంతో పేరు ప్రతిస్టలు ఉన్న డా.నోరి సంపాదించినదంతా ' ఆరోగ్య సంపదను ' పెంచడానికి , అభివృద్ధి చెందడానికి వెచ్చించారు . ఈ అంతర్జాజీయ ఆణిముత్యము ఆంధ్రప్రదేశ్ కు చెందినవారు కావడం మన అందిరికీ గర్వకారణము .

వీరి స్వగ్రామము కృష్ణాజిల్లా లోని మంటాడ . 1947 అక్టోబర్ 21 న జన్మించారు . నాన్న గారు సత్యనారాయణ -టీచరు గా పనిచేసారు . అమ్మ గారు కనకదుర్గ - గృహుణి . వీరిది చాల పేద కుటుంబము . ఈ డాక్తర్ తోబుట్టువులు పది మంది . 5 గురు మగ , 5 గురు ఆడ పిల్లలు . ఇతను అందరికంటే చిన్నవాడు . తను 5 సం.లు వయసున్నప్పుడే నాన్నగారు చనిపోయారు . అమ్మ గారి సంరక్షణలో 7 వ తరగతి వరకూ బందరు లో చదువుకున్నారు . పి.యు.సి , బి.యస్.సి - ఆంధ్ర జాతీయ కళాశాలలోను , 1965 - 1971 వరకు MBBS కర్నూలు వైద్యకళాశాలలోను , 1976 లో ఉష్మానియా మెదికల్ కాలేజీ లో M.D. పూర్తి చేసారు . పెద్దమ్మ జొన్నలగడ్డ సుందరమ్మ గారి సహాయము తో తన చదువంతా సాగింది . నెలనెలా డబ్బులు సాయము చేసేవారు .

ఫిబ్రవరి 1972 నుండి ఫిబ్రవరి 1973 వరకూ గాంధీ ఆసుపత్రి లోపనిచేసారు . 1973 నుండి 1976 వరకు హైదరబాద్ ఉష్మానియా యూనివర్సిటీ కి అనుబంధం గా ఉన్న రేడియం ఇంస్టిట్యూట్ అండ్ క్యాన్సర్ హూస్పిటల్ లో రెసిడెంట్ గా పనిచేసారు . అనంతరము అమెరికా వెళ్ళారు . ఈతనికి మొదటి నుండీ క్యాన్సర్ వైద్యం లో ఏదో చేయాలని తపన ఉండేది . అందుకే ఈ విభాగములో నూతన విధానాలు కనిపెట్టడానికి కృషిచేసారు . తన కృషిలో ఎన్ని వైఫల్యాలు ఎదురైనా లెక్కచేయకుండా విజయం కోసం తపించారు . అందుకే ఆయన ఈస్థితికి చేరుకున్నారు . క్యాన్సర్ వ్యాధికి సంబంధించి 4 పుస్తకాలు , 200 పైగా పేపర్లు రాసారు .

అవార్డులు :
1962 లో ప్రీ-యూనివర్సిటీ లో చదివేటపుడు , 1965 లో బి.యస్ .సి చదివేటపుడు , ఉష్మానియాలో ఎం.డి. చేసినపుడు అత్యధిక మార్కులు రావడం తో మెరిట్ స్కాలర్ షిప్ ఇచ్చారు .
1984 లో అమెరికన్‌ క్యాన్సర్ సొసైటీవారు క్లినికల్ పెలోషిప్ ఫ్యాకల్టీ అవార్డ్ ఇచ్చారు . 1990 లో అమెరికన్‌ కాలేజీ ఆఫ్ రేడియేషన్‌ ఫెలోషిప్ కు ఎంపికయ్యారు . 1994 లో అలుమిని సొసైటీ , మెమోరియల్ స్లాన్‌-కెటరింగ్ క్యాన్సర్ సెంటర్ డిస్టింగ్విష్డ్ అలునినస్ అవార్డ్ అందుకున్నారు .
2000 లో ఇప్పటి వరకు కాస్టల్ అండ్ కానల్లే పబ్లికేషం వారి అమెరికా బెస్ట్ డాక్టర్ , లేడిస్ హోం జర్నల్ నిర్వహించే సర్వేలో మహిలల క్యాన్సర్ నివారణ లో ఉత్తం డాక్టర్ ఎంపికయ్యారు .
1995 లో ఇండియన్‌ మెడికల్ అసోసియేషన్‌ గోల్డ్ మెడల్ అందుకున్నారు .
2003 లో అమెరికన్‌ కాలేజి ఆఫ్ రేడియేషన్‌ అంకాలజీ ఫెలోషిప్ అందుకున్నారు .

బసవతారక క్యాన్స్ ర్ ఇంస్టి్ట్యూట్ నిర్మాణము అప్పటి ముఖ్యమంత్రి యన్‌.టి.రామారావు గారి సహాయ సహకారాలతో జరిగినది . ఎన్‌టీ రామారావు గారి భార్య్ బసవ తారకం గారికి క్యాన్సర్ సోకడంతో ఆమెను అమెరికాలో ఉన్నా దత్తాత్రేయుడు గారి దగ్గరకు తీసుకొచ్చారు . ట్రీట్మెంట్ జరిగి బాగు అయిన కొన్నాళ్ళు బ్త్రతికేరు . అంతకు ముందే డా.నోరి గారికి ఆంధ్రప్రదేశ్ లో ఒక క్యాన్సర్ హాస్పిటల్ స్థాపించాలనే ఉద్దేశము ఉండడం ... దానికి తోడు ముఖ్యమంత్రి అడగడం జరిగిన పిమ్మట ప్రభుత్వము 7 ఎకరాల భూమిని హైదరాబాద్ లో ఇవ్వడము , కొంతమంది అమెరికా తెలుగు వారి చందాలతోను , గవర్నమెంట్ ఆర్ధిక సాయము తో 200 పడకల హాస్పిటల్ కెపాసిచిటీ తో అన్ని నూతన వైద్య పరికరాలతో " బసవతారక ఇండో-అమెరికన్‌ కాన్సర్ ఇంస్టిట్యూట్ " నిర్మాణము జరిగి ఫెలోషిప్ కోర్సులను కూడా ప్రారంభమంచడం జరిగునది .

ఫామిలి విషయాలు :
భార్య : సుభద్ర .. ఈమె కూడా డాక్టర్ కావడం వల్ల అన్నివధాల సహకారము అందేధని అంటున్నారు .
పిల్లలు : ఇద్దరు ->అబ్బాయి - సంతోష్ న్యాయవాది , అమ్మాయి డాక్టర్ .
  • =======================================================
Visit My website - > Dr.Seshagirirao

1 comment: