ప్రొఫైల్ :
- పేరు : వేటూరి ప్రభాకర శాస్త్రి ,
- పుట్తిన తేదీ : 7 ఫిబ్రవరి 1888 ,-
- మరణము : 29 ఆగస్టు 1950,
- మతము : హిందు ,
- చదువు : తెలుగు , సంస్కృతం లో పండితుడు ,
- పిల్లలు : కొడుకు .. వేటూరి ఆనందమూర్తి ,, స్కాలర్ ,
సాహిత్య చరిత్ర ఆ జాతి మనోవికాస వైభవానికి చిహ్నం. వేటూరి ప్రభాకరశాస్ర్తి అలాంటి ఓ సాహిత్య చరిత్రకే ప్రకాశం. ఆయన ఒట్టి మేధావి కాదు..తెలుగు భాషా, చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసిన కూలీ!ఆయన ఒట్టి రచయిత కాదు..విమర్శనా వ్యాస రచనకు ఆద్యుడు. పన్నెండో ఏటే పరభాషలో కవితా సుమాలు వెదజల్లిన అనన్యుడు.
ఇంకా...
పిన్నవయసు శతావధాని, తొలితెలుగు పదం ‘నాగబు’ ఆవిష్కర్త, ‘కలికి చిలుక’ను పలికించిన కథకుడు, ‘కడుపు తీపు’, ‘దివ్యదర్శనం’, ‘మూణ్ణాళ్ల మచ్చట’, ‘కపోతకథ’ వంటి ఖండకావ్యాల విరచితుడు, విమర్శకాగ్రేసరుడు, కాలగర్భంలో కలిసిపోతున్న తెలుగు సంస్కృతీ చరిత్రను దక్షిణదేశమంతటా ఈది మరీ ఒడ్డుకు చేర్చిన సాహిత్య ఘనాపాటి.
శృంగారశ్రీనాథం, క్రీడాభిరామం, బసవపురాణం, రంగనాథ రామాయణం, తంజావూరి ఆంధ్ర రాజుల చరిత్ర, ప్రాచీనాంధ్ర శాసనములు, శాతవాహనులు, ఇక్ష్వాకులు, రెడ్డిరాజులు, అన్నమాచార్య కీర్తనలు, తొలితెలుగు రచయిత్రి తిమ్మక్క, తొలి తెలుగు శాసనము... ఇవన్నీ, వీరందరూ ఈరోజు మనకందుబాటులో ఉండటానికి ముఖ్యకారకుడు ఈ మహానుభావుడే!
- ==========================
No comments:
Post a Comment