మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -అయ్యంకి వెంకటరమణయ్య- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
అయ్యంకి వెంకట రమణయ్య-- గ్రంధాలయోద్యమకారుడు మరియు పత్రికా సంపాదకులు. ఈయన గ్రంథాలయ ఉద్యమంలో జీవితాంతం (అరవై సంవత్సరాలు) విశేష కృషి సల్పి 'గ్రంధాలయ పితామహుడు'గా
పేరుగాంచారు. వీరు తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం తాలూకా కొంకుదురు గ్రామంలో ఆగష్టు 7, 1890 సంవత్సరంలో జన్మించారు. వీరి తల్లిదండ్రులు వెంకటరత్నం మరియు మంగమాంబ. నరసాపురం టైలరు ఉన్నతపాఠశాలలో చదువుతున్న రోజులలో బిపిన్ చంద్ర పాల్ ఉపన్యాసాలను విని ఉత్తేజితులై ప్రజారంగంలోనికి ప్రవేశించారు.
గ్రంధాలయోద్యమం
వీరు 1911లో విజయవాడలో రామమోహన గ్రంథాలయ స్థాపనకు తోడ్పడ్డారు. 1914లో విజయవాడలో ఆంధ్రదేశ గ్రంథ భాండాగార, ప్రతినిధుల గ్రంథాలయ మహాసభలు జరిపి భారతదేశంలో తొలిసారిగా గ్రంధాలయ సంఘాన్ని, 1915లో సంఘ పక్షాన 'గ్రంథాలయ సర్వస్వం' పత్రికను స్థాపించడానికి తోడ్పడ్డారు. 1919లో అఖిల భారత పౌర గ్రంథాలయ సంఘాన్ని స్థాపించి, 1924లో ఆ సంఘ పక్షాన 'ఇండియన్ లైబ్రరీ జర్నల్' అనే ఆంగ్ల పత్రికను ప్రారంభించారు. వీరు ఈ సంఘాన్ని స్థాపించిన రోజును 'నేషనల్ లైబ్రరీ డే'గా భారత గ్రంథాలయ సంస్థ గుర్తించి దేశమంతటా 1968 నుంచి ప్రతి సంవత్సరం 'నేషనల్ లైబ్రరీ వీక్ (National Library Week)' ను నిర్వహిస్తుంది.
1934-1948 మధ్యకాలంలో గ్రంథాలయ యాత్రలను అపూర్వమైన స్థాయిలో పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో కార్యదర్శులు నిర్వహించారు. వీని మూలంగా వందల సంఖ్యలో కొత్త గ్రంథాలయాలు
ఏర్పడ్డాయి. మూసివేసినవి పునరుద్ద్రించబడ్డాయి. 1920, 1934లలో గ్రంథాలయ కార్యదర్శులకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఆంధ్రదేశంలోని ప్రతి గ్రామం వీరు పర్యటించారు.
మరణం -- 1979
గౌరవాలు
* గ్రంథాలయ విశారద, గ్రంథాలయ పితామహ, గ్రంథాలయోద్ధారక, సరస్వతీ సామ్రాజ్య ప్రతిష్ఠాపనాచార్య.
* భారత ప్రభుత్వం 1972 లో పద్మశ్రీ గౌరవాన్నిచ్చింది.
* ఆంధ్రవిశ్వ కళాపరిషత్తు గ్రంథాలయ శాస్త్ర పరీక్షలో ఉత్తమ విద్యార్థికి వీరి పేరుతో స్వర్ణ పతకం ఇస్తుంది.
* 1979లో అయ్యంకి లైబ్రరీ కమిటీ ఏర్పడి ప్రతి సంవత్సరం ఉత్తమ గ్రంథాలయ కార్యకర్తను సత్కరిస్తోంది.
Visit My website - > Dr.Seshagirirao
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment