Saturday, July 30, 2011

గోరా (గోపరాజు రామచంద్రరావు). ,Goparaju Ramachandra Rao



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -గోరా (గోపరాజు రామచంద్రరావు)- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



స్వాతంత్య్ర సమరయోధునిగానే కాక నాస్తికత్వానికి మార్గదర్శిగా ప్రజల హృదయాలలో నిలిచినవాడు గోరా (గోపరాజు రామచంద్రరావు). నాస్తికత్వం అంటే స్వేచ్ఛా ప్రవృత్తి స్వశక్తి విశ్వాసం అన్న కొత్త నిర్వచనమిచ్చాడు ఆయన. ఒడిషా రాష్ట్రం గంజుం జిల్లాలోని ఛత్రపురంలో 1902, నంబర్‌ 15న వెంకటసుబ్బారావు, రాజ్యలక్ష్మి దంపతులకు గోరా బ్రాహ్మిణ కుటుంబం లో జన్మించారు. పర్లా కిమిడిలో ప్రాథమిక వి ద్యాభాసం పూర్తిచేసిన ఆయన 1913లో పిఠాపురం రాజా కాలేజి హైస్కూల్‌లో చదివారు. 1920లో పి.ఆర్‌. కాలేజ్‌లో ఇంటర్‌ పూర్తిచేసిన గోరా సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభంలో ఆ ఉద్యమంలోకి వెళ్లారు. 1922లో మద్రాసు ప్రెసిడెన్షి కళాశాలలో వృక్షశాస్త్రంలో బిఏ చేశారు. తర్వాత మధురలోని మిషన్‌ కళాశాలలో అధ్యాపకుడిగా చేరారు. కోయంబత్తూరు వ్యవసాయ కళాశాలలో కాటన్‌ రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా, తర్వాత కొలంబోలోని ఒక కళాశాలలో బయాలజీ అధ్యాపకునిగా, 1928లో కాకినాడ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేశారు. తాను నడిచే మార్గం తండ్రికి ఇష్టం లేకపోవడంతో 1928లో భార్యపిల్లలతో ఇంటిని వదిలేసి వచ్చాడు. ఉప్పు సత్యాగ్రహ కాలంలో తనకు పుట్టిన బిడ్డకు లవణం అని నామకరణం చేశారు. తర్వాత సంతానానికి సమరం, నియంత, విజయం తదితర పేర్లను గోరా తమ పిల్లలకు పెట్టుకున్నారు. గోరా సతీమణి సరస్వతి గోరా కూడా భర్త అడుగుజాడల్లో నడిచారు. స్వతంత్ర భావాలుగల గోరా ఎక్కడా ఉద్యోగంలో నిలువలేకపోయాడు. 1940, ఆగస్టు 10న కృష్ణా జిల్లా ముదునూరులో ప్రపంచంలోని మొట్టమొదటి నాస్తిక కేంద్రాన్ని 80 మంది యువకులతో గోరా ప్రారంభించారు. ఈ కేంద్రం ప్రారంభంతో గోరా జీవితంలో నూతన అధ్యాయం మొదలైంది. 1940 నుంచి 1944 వరకు అక్షరాస్యత, అస్పృశ్యత, సహపంక్తి భోజనాలు వంటి ఉద్యమాలు మడనూరు చుట్టుపక్కల నిర్వహించారు.

పూర్తి వివరాలకోసం -> గోరా (గోపరాజు రామచంద్రరావు)
  • =========================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment