Tuesday, August 30, 2011

గూటాల కృష్ణమూర్తి ,Gutala Krishna murty


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -గూటాల కృష్ణమూర్తి- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

గూటాల కృష్ణమూర్తి ఇంగ్లండులో పనిచేసే ఇంగ్లీషు ప్రొఫెసరైనా వారికి ఆధునిక తెలుగు సాహిత్యంపై చాలా మక్కువ. రాచకొండ విశ్వనాథశాస్త్రి పట్ల అభిమానం. శ్రీశ్రీ మహా ప్రస్థానం కవిగారి సొంతగొంతుతో రికార్డు చేయించి అందంగా మహా ప్రస్థానం విదేశాంధ్ర ప్రచురణగా అచ్చువేయించిన సాహి త్యాభిమాని కృష్ణమూర్తి. ఈయన 'జుబ్బా లేని అబ్బాయి' అని ఒక చాలా పెద్ద నవల తెలుగులో సంకల్పించి మొదటి ప్రకరణాలేవో రాసినట్లూ, మనదేశం లోని సామాజిక జీవ న అస్తవ్యస్తతలు, అన్యాయాలు, దోపిడీ వ్యవస్థ, అణగారిన వర్గాల పేదరికం, దుర్భరయాతన ప్రతీకాత్మకంగా పెద్ద నవలగా రాయాలని ఆయన అనుకుంటున్నట్లు ఆయన మాటలను బట్టి తెలిసింది.

విదేశాంధ్ర ప్రచురణల సంస్థాపకులు, ఇంగ్లీషు ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి గారు సూర్యకుమారి గారి పై ఒక ప్రత్యేక గ్రంధం ప్రచురించారు. ఇదివరలో, ఆయన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు మనకి అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబర్ 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల అయింది. బాపు గారి మిత్రులైన శ్రీ గూటాల కృష్ణమూర్తి గారు వారి కొడుకు, కోడలు వారి పిల్లలను చూడడానకి లండన్ నుంచి ఇండియా వచ్చారు. ఆయన చాలా పెద్దవారు. 80 ఏళ్ళు దాటాయి. ఈ వయసులో ప్రయాణం చేయటం కష్టమే. పైగా వారు ఇండియా రావడం చాలా అరుదు. మార్చి ౩ (2009) న వారొచ్చినపుడు వారిని చాలామంది కలిసారు . ఆ సందర్భంగా వారు టంగుటూరి సూర్యకుమారితో వారికి వున్న పరిచయం గుర్తుచేసుకున్నారు (వీరే ఈ మధ్య 2008 లో సూర్యకుమారి గారిపై ఒక ఖరీదైన పుస్తకం ప్రచురించారు.). పైన వున్న బొమ్మను గూటాల గారు సూర్యకుమారిగారికి చూపించినపుడు, ఈ ట్రిక్కు ముందే తెలిస్తే బాగా చదువుకోవాలన్న కోరిక కొంతవరకైనా తీరేదని అన్నారంట. చదువుతున్నపుడు నిద్ర ఆపుకోలేక తల వాల్చడానికి ప్రయత్నిస్తే మేకుకు కట్టిన పిలక వల్ల అది సాధ్యపడదన్నమాట.

భారతదేశములో గూటాలగా , ఇంగ్లాండులో జి.కె.గా ప్రసిద్ధుడైన గూటాల కృష్ణ మూర్తి 1928 జూలై 10 వ తేదీన పర్లాకిమిడిలో జన్మించారు . విజయనగరము లోనూ , విశాఖపట్నం ఎ.వి.ఎం.కళాశాలలో నూ , ఆంధ్రవిశ్వవిధ్యాలయములోనూ విద్యనభ్యశించి ఆంగ్ల సాహిత్యములో ఆనర్స్ పూర్తిచేసి మూడేళ్ళు అమలాఅపురం ఎస్.కెంబి.ఆర్.కాలేజీ , మరో మూడేళ్ళు ప్రస్తుతము చత్తిస్ ఘడ్ రాస్ట్రము ఉన్న బిలాస్ పూర్ కాలేజీలలోనూ ఆంగ్లోపాధ్యాయునిగా పనిచేశారు . అక్కడ పనిచేస్తూనే సాగర్ విశ్వవిద్యాలయములో పార్ట్ టైం పరిశోధకునిగా " ఫ్రాన్సిస్ ధామస్ - ఎ క్రిటికల్ బయోగ్రఫీ " అన్న అంశము పై పరిశోధన చేపట్టారు . 1962 లో లండన్‌ టైమ్‌స్ పత్రికా కార్యాలయములో గుమస్తా ఉద్యోగము కోసం లండన్‌ వచ్చిన గూటాల అక్కడే తన పి.హెచ్.డి కొనసాగించి 1967 లో డాక్టరేట్ సంపాధించారు . ఆ తర్వాత ఇన్నర్ లండన్‌ ఎడ్యుకేషన్‌ అథారిటీ సర్వీసులో ప్రవేశించి లండన్‌ లోని వివిద విద్యాలయాలలో అధ్యాపకునిగా పనిచేసారు .

కృష్ణమూర్తి గారి భార్య శ్రీమతి వెంకటరమణ ఆ రోజులలో నే బెనారస్ విశ్వవిధ్యాలయం నుండి ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఎమ్‌.య్స్.సి. పట్టభదృరాలు . వివిధ కళాశాలల్లో అధ్యాపకురాలిగా పనిచేసారు . వీరికి ఇద్దరు అబ్బాయిలు , ఒక అమ్మాయి .

  • జుబ్బాలేని అబ్బాయి ,
  • భజగోవిందం ,
  • కుకునం (వంట ) ,
  • క్లిననం (వంటపాత్రలు , ఇల్లు శుభ్రము చేయడం ) ,
  • స్లిపనం (సంసారము చేయడం ) ,
  • కననం (పిల్లల్ని కనడం) , మున్నగునవి గూటాల వ్రాసిన కొన్ని పుస్తకాలు / కవితలు .


మూలము : పద్మశ్రీ డా.యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ .
  • ====================================
Visit My website - > Dr.Seshagirirao

1 comment:

  1. As a student of SKBR college Amalapuram it is gratifying to know his progress and achievements in the field of literature

    ReplyDelete