పొట్టి శ్రీరాములు 1901 మార్చి 16న మద్రాసు, జార్జిటౌను, అణ్ణాపిళ్ళె వీధిలోని 165వ నంబరు ఇంటిలో గురవయ్య, మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. వారి పూర్వీకులది ప్రస్తుత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా లోని పడమటిపాలెం గ్రామం. ఇరవై యేళ్ళ వరకు శ్రీరాములు విద్యాభ్యాసం మద్రాసు లోనే జరిగింది. తరువాత బొంబాయిలో శానిటరీ ఇంజనీరింగు చదివాడు. తరువాత "గ్రేట్ ఇండియన్ పెనిన్సులర్ రైల్వే"లో చేరి దాదాపు నాలుగేళ్ళు అక్కడ ఉద్యోగం చేసాడు. అతని జీతం వెలకు 250 రూపాయలు.
ప్రత్యేకాంధ్ర కొరకు పొట్టి శ్రీరాములు 19-10-1952న నిరాహార దీక్ష చేపట్టి 56 రోజుల నిరాఘాటంగా కొనసాగిం చిన తరువాత తేదీ 16-12-1952న 'అమ రజీవి' అయ్యాడు. ఆయన ఆత్మత్యాగంతో తేదీ 25-03-1953న భారత ప్రధాని నెహ్రు ఒక ప్రకటన చేశాడు. అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతుంది. రాజధానిగా మద్రాసు ను ఉంచే ప్రసక్తి లేదు గనక ఆంధ్ర శాసనస భ్యులే వారి ప్రాంతంలో తమ రాజధానిని ఎన్నుకోవాలి అనేది ఆ ప్రకటన సారాంశం. దాని ఫలితంగా అక్టోబర్ 1, 1953వ సంవ త్సరం కర్నూలు రాజధానికిగా ఆంధ్రరాష్ట్రాన్ని నెహ్రు ఆవిష్కరించారు. తరువాత నవంబర్ 1, 1956వ సంవత్సరంలో తెలంగాణాతో కలిపి అన్ని నూతన రాష్ట్రాలతో పాటు ఆంధ్రప్రదేశ్ అవతరించింది.
for More details - > Potti Sriramulu(Telugu)
- ======================
No comments:
Post a Comment