కవిరాజుగా ప్రసిద్ధి చెందిన త్రిపురనేని రామస్వామి ప్రముఖ హేతువాద రచయిత, సంఘసంస్కర్త. త్రిపురనేని రామస్వామి 1887 జనవరి 15న కృష్ణా జిల్లా, అంగలూరు గ్రామంలో ఒక రైతు కుంటుంబంలో జన్మించాడు.
రామస్వామి రైతు కుటుంబములో పుట్టినా చిన్నప్పటినుడి సాహితీ జిజ్ఞాసతో పెరిగాడు. తన 23వ యేట మెట్రిక్యులేషన్ పరీక్ష ఉత్తీర్ణుడైనాడు. ఆదే సంవత్సరము ఆయన పల్నాటి యుద్ధము ఆధారముగా కారెంపూడి కదనం, మహాభారత యుద్ధము ఆధారముగా కురుక్షేత్ర సంగ్రామము అను రెండు నాటికలు రచించాడు. 1911 లో ఇంటర్మీడియట్ చదవడానికి బందరు లోని నోబుల్ కాలేజీలో చేరాడు. అక్కడ ఉన్న కాలములో అవధానము చేసి తన సాహితీ నైపుణ్యమును మరియు అద్భుతమైన జ్ఞాపకశక్తిని ప్రదర్శించాడు.
పూర్తి వివరాలకు -- తెలుగు వికిపెడియాను చూడంది -> త్రిపురనేని రామస్వామి చౌదరి
- =====================================
No comments:
Post a Comment