Monday, May 9, 2011

డాక్టర్ అశ్వథనారాయణ , Aswadhanarayana Dr.



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -డాక్టర్ అశ్వథనారాయణ (Aswadhanarayana Dr.)- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


డాక్టర్ అశ్వథనారాయణ గారు " ఐసోటోప్ జియో కెమిస్ట్రీ " లో అంతర్జాతీయ నిపుణుడు - ఈ క్షేత్ర రంగంలో ప్రపంచ మహా మహులలో దిగ్గజం. జియాలజీ క్షేత్ర రంగంలో నిష్ణాతుడిగా అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఈ మేటి భూగర్భ శాస్త్రవేత్త, పరిజ్ఞనానికి " సోషియో ఎకనామిక్ " అంశం అనుసందానించి సద్ ఫలితాలు సాధించారు.వీరి పీ హెచ్ డి థీసిస్ నేడు - " న్యుక్లియర్ జియాలజీ " గా వెలసింది. అణు భూగర్భ శాస్త్ర క్షేత్రంలో డాక్టరేట్ సాదించిన ప్రప్రదమ భారతీయుడు. ఐదు దశాబ్దాల పాటు భూగర్భ, పర్యావరణ క్షేత్రాలలో తన అమూల్యమైన సేవలు అందిస్తూ వచ్చారు. భూ రసాయిన శాస్త్రాన్ని ప్రజా ప్రయోజనాలకి మళచిన అనుభవ యోగ్య శాస్త్రవేత్త.

For details click here -> Aswadhanarayana dr.
  • =============================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment