Monday, April 4, 2011

చిత్తూరు నాగయ్య,Chitturu Nagayya


  • [Nagayya-Chittor+123.jpg]

మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -చిత్తూరు నాగయ్య- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


చిత్తూరు నాగయ్య జయంతి: తెలుగు సినీ పరిశ్రమకే పితామహులు, పూజ్యులు, స్వాతంత్య్ర సమరయోధుడు, అజాతశత్రువు అయిన చిత్తూరు నాగయ్య మార్చి 28, 1904 న గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించారు. వృత్తిరీత్యా ఆయన చిత్తూరు జిల్లాలో స్థిరపడి అక్కడే అనేక నాటకాల ప్రదర్శనలు ఇవ్వడంతో ఆయన రంగస్థల నటుడు చిత్తూరు నాగయ్యగా చిరపరిచితులు. నాగయ్య స్వతహాగా గాయకుడు కూడా. ఆయన ఇంటిపేరు ఉప్పల ధడియం. కొంతకాలం హెచ్‌ఎంవి గ్రామఫోన్‌ రికార్డు కంపెనీలో మ్యూజిక్‌ డైరక్టర్‌గా కూడా పనిచేసేవారు. ఆయన నటించిన దేవత, సుమంగళి, వందేమాతరం, స్వర్గసీమ, పోతన, వేమన, త్యాగయ్య, రామదాసు మొద లైన సినిమాలు కళాఖండాలుగా చెప్పదగినవి.

for more details -> click here Chitturu Nagayya
  • ===================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment