Monday, April 4, 2011

పుట్టపర్తి నారాయణాచార్య,Puttaparthi Narayanacharya
మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -పుట్టపర్తి నారాయణాచార్యులు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

పుట్టపర్తి నారాయణాచార్య జయంతి-- 28-3-1915న .. సేకరణ

పుట్టపర్తి నారాయణాచార్య అనంతపురం జిల్లా చియ్యేడు గ్రామంలో పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, లక్ష్మీ దేవమ్మ దంపతులకు 28-3-1915న జన్మించారు.ఆయన తండ్రి శ్రీనివాసాచార్యులు, తల్లి లక్ష్మిదేవి గొప్ప సంస్కృత ఆంధ్ర పండితులు. అసలు వారి ఇంటి పేరు తిరుమల వారు. కృష్ణదేవరాయల రాజగురువు తిరుమల తాతాచార్యుల వంశం వారిది. తాతాచార్యులు గొప్ప శాస్త్ర పండితుడు. ఆయన గురించి కొందరు అల్పబుద్ధుల వల్ల హాస్యకథలు పుట్టాయి. ఆ తర్వాత వారి వంశీయులు చిత్రావతీ తీరంలో పుట్టపర్తిలో ఉండడం వల్ల ఇంటిపేరు పుట్టపర్తి అయింది. దాదాపు ముప్పరుయేళ్ళ వరకు అనంతపురంలో వున్న ఆచార్యులు కడపజిల్లాకు చెందిన కనకమ్మను పెండ్లి చేసుకున్నాక జీవితం ఆఖరి వరకు కడప గడపలే తన సాహిత్య ప్రస్థానంగా జీవించారు.. దక్షిణభారతదేశపు భాషలతో పాటు బెంగాలీ, మరాఠీ, ఫ్రెంచి, పార్శీ భాషను నేర్చుకుని 14 భాషలలో ప్రవీణులయ్యారు. పధ్నాలుగు సంవత్సరాల వయసులోనే ‘పెనుగొండ లక్ష్మి’ అనే పద్యకావ్యాన్ని రచించారు. ఈ కావ్యం విద్వాన్‌ పరీక్షకు సైతం ప్రభుత్వం వారిచే పాఠ్యగ్రంథంగా ఎన్నిక కాబడటం విశేషం. మరో విశేషమేమిటంటే అప్పటికి నారాయణాచార్య విద్వాన్‌ పరీక్ష రాసే వయసు కూడా లేదు. ఆ తర్వాత నారాయణాచార్య విద్వాన్‌ పరీక్ష రాయవలసి వచ్చినప్పుడు తాను రచించిన ఈ పెనుగొండ లక్ష్మి అనే పద్యకావ్యాన్నే పాఠ్యగ్రంథంగా చదువుకోవాల్సివచ్చింది. బహుశా ఏ కవికీ, ఏ రచయితకూ కూడా ఇటువంటి అనుభవం ఎదురైవుండదు. ఇరవై వేల ద్విపదులతో పుట్టపర్తివారు పండరి భాగవతాన్ని రచించారు. ప్రఖ్యాత కవి విశ్వనాధ సత్యన్నారాయణ రచించిన ఏకవీర నవలను పుట్టపర్తి నారాయణాచార్య మళయాళంలోకి అనువదించారు. ఇంకా అగ్నివీణ, షాజీ, గాంధీజీ ప్రస్థానం, సాక్షాత్కారం మొదలైన ఇతర కృతులు రచించారు పుట్టపర్తివారు.


తిరువాన్కూర్‌ యూనివర్శిటీ వారు మలయాళ భాషా నిఘంటువు రూపొందించదలచి దక్షిణభారతదేశంలో బహుభాషా వేత్త యెవరైనా ఉన్నారా అని అన్వేషించింది. చివరికి యేలాగో కడపలో ఉన్న పుట్టపర్తి నారాయణాచార్యులను కనుగొన్నారు. ఆచార్యులు మలయాళ నిఘం టువు నిర్మాణం సమర్థవంతంగా పూర్తిచేయడమే కాక, ఎన్నో ఆదానప్రదానాలు చేశారు. ఆనాటి మలయాళ, సంస్కృత విద్వాం సుడు సూరనాడు కుంజన్‌ పిళ్ళరు. మలయాళంలోగొప్పకవి. ఆయనే ఆచార్యులను కనుగొని తమ భాషా నిఘంటువు నిర్మాణబాధ్యత అప్పగించారు.
అటువంటి అరుదైన పండితుడు కవి పుట్టపర్తి నారాయణాచార్యులు 1990 సెప్టెంబర్‌ 1వతేదీ కడపలో కన్నుమూశారు. ఆచార్యులు ఆసుపత్రిలో మరణశయ్యపై ఉండి కూడా గ్లాస్‌గోస్త్‌పెరిస్త్రోయికా చదువుతూ వుండటం ఆయన పఠనాసక్తిని చాటుతోంది.

For full details Read in Telugu Wikipedia.org - పుట్టపర్తి నారాయణాచార్యులు
  • ======================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment