Thursday, July 14, 2011

శ్రీ వెంగమాంబ , Sri Vengamamb



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -శ్రీ వెంగమాంబ ( Sri Vengamamb)- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

అభాగ్యులను ఆదరిస్తూ... ఆదర్శ గృహణి గా విరాజిల్లుతూ... భక్తుల కొమ్ముబంగారంగా, భక్తుల కోరికలను తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతోంది శ్రీ వెంగమాంబ. శ్రీకృష్ణదేవరాయలు దక్షిణ భారతదేశాన్ని పాలించే సమయంలో విక్రమ సింహ పూరి మండలమైన ఉదయగిరి పరిసర ప్రాంతంలో దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామానికి ఆగ్నే యంగా వున్న వడ్డెపాలెం గ్రామానికి చెందిన శ్రీపచ్చవ వెంగయ్య నాయుడు, సాయమ్మ లకు పూర్వజన్మ ఫలమైన శ్రీ రేణుకాదేవి అనుగ్రహమున జన్మించింది.. శ్రీ వెంగమాంబ.

-బాల్యము నుండే దైవచింతన కలిగి ఆత్మజ్ఞానముతో తోటిబాలికలకు జ్ఞాన బోధ చేస్తూ.. అక్కడికి చేరిన ప్రజలకు శక్తి రూపంలో దర్శనమిస్తూ.. వారికి భక్తి భావం కలిపించి, వింతలు కొలుపుచుండేది.ఈమెను అదే గ్రామానికి చెందిన వేమూరి గురవయ్య నాయుడికి ఇచ్చి వివాహం చేశారు. వివాహ నంతరం శ్రీవెంగమాంబ సుఖజీవితాన్ని చూసి ఓర్వలేని ఆడబిడ్డ, మనసు మారిన అత్త పెట్టే బాధలు సహిస్తూ.. వయోవృద్ధుడు, జ్ఞాన హృ దయుడైన బావ ముసలయ్యకు తగిన సేవలం దిస్తూ.. మితభాషినియై భర్త అనురాగానికి పాత్రురాలైంది. ఆపరిస్థితుల్లో మెట్ట ప్రాంతమై న నర్రవాడ పరిసర గ్రామాల్లో వర్షాలు లేక తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడింది. చుట్టు గ్రామాల ప్రజలందరు నర్రవాడ లో బావి దగ్గరకు వెళ్ళి త్రాగునీరు తెచ్చుకునేవారు. ఆ ఊరి ప్రజలు బావి వద్దకు హరిజనుల రానిచ్చేవారుకాదు.

హరిజనులు ఆ బావికి దూరంగా కడవలు వుంచుకొని ఎవరైనా నీరు పోస్తారేమోనన్న ఆశతో ఎదురుచూస్తుండేవారు. ఆ బావి నీటికి వచ్చిన శ్రీవెంగమాంబ వారి ధీనస్థితిని చూసి జాలి పండింది. వారందరికి నీరు తోడిపోసిన తరువాత తన ఇంటికి నీరు తీసుకొనిపోయేది. ఒకనాడు గ్రామ ధైన్య స్థితిని చూసి ఇష్టదైవాన్ని వేడుకోగా తక్షణ మే వెంగమాంబ మొరను ఆలపించిన భగవంతుడు కుండపోతతో వర్షం కురిపిం చాడు. దీంతో నీటి ఎద్దటి నివారణ కావడమేకాకుండా హరిజనుల హర్షానికి హద్దు లు లేకుండాపోయాయి.

అందరికి చేరువలో జగన్మాత... శ్రీ వెంగమాంబ
కోట్లాది భక్తుల సంతానలక్ష్మిగా... భక్తుల కొంగుబం గారంగా... శ్రీ వెంగమాంబ కల్యా ణం చేయటానికి చుట్టు గ్రామాల ప్రజలతోపా టు కులమతాలకు అతీతంగా పూజలందుకుం టున్న జగన్మాత... శ్రీ వెంగమాంబ ఆప్రాం తంలోని మరోరూపంలో వెలసారు. ప్రస్తుత మున్న దేవాలయంలో ఇతర కులాలకు విగ్ర హాన్ని పంపే అవకాశం లేకపోవటం అన్ని కుల మతాలనుంచి భక్తులు అత్యధికంగా పూజచే స్తున్న శ్రీ జగన్మాత అందరికి చేరువ చేయాల నే ఉద్దేశంతో మాజీ మంత్రి మాదాల జానకి రాం ఆధ్వర్యంలో అక్కడే జగన్మాత శ్రీ వెంగ మాంబ దేవాలయ నిర్మాణం చేశారు. ఈ దేవా లయం నుంచి ఏ గ్రామానికైన, ఏకులంవారికై న కల్యాణ విగ్రహంతో పూజలు చేసుకునే అ వకాశం ఉంది. ఇక్కడ ఈ విధానం వలన జగ న్మాత వెంగమాంబ ప్రజలకు చేరువకావటం గమనించిన కొంత మంది రాజకీయ నేతలు దేవాలయ ముఖద్వారానికి అడ్డంగా గోడను ని ర్మించి ఆలయ నిర్మాణానికి అహంకృషి చేసి న మాజీ మంత్రి మాదాల జానకిరాంపై అక్ర మ కేసులు బనాయించే ప్రయత్నాలు చేశారు.

-నిన్నటివరకు పేరంటాల దేవాలయం స్థానిక శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి అ నుచరుడైన తుమ్మల వెంగయ్య ఆధ్వర్యంలో చలామణి అవుతుండగా మారిన రాజకీయ ప రిణామాల దృష్ట్యా తుమ్మల వెంగయ్య ఆధీనం లో జరుగుతున్న ఉత్సవ కమిటీలో మాదాల చెక్‌ పెట్టి రాష్ట్ర మంత్రి రామనారాయణ రెడ్డి సహకారంతో 12 మంది అనుచరులతో ఉత్సవ కమిటీని ఆలయ చరిత్రలోనే మొదటి సారిగా నియమించుకొని ఈ బ్రహ్మో త్సవాల లో రెండు దేవాలయాల్లో తన పూర్తి ఆధిపత్యా న్ని చలాయించే విధంగా ప్రణాళిక రూపొం దించుకున్నారు. అటు పేరంటాల వెంగమాం బ ఇటు జగన్మాత వెంగమాంబ ఉత్సవాలు ఒకేరోజు ఒకే షెడ్యూలులో జరగటం దేశవిదే శాలనుంచి వచ్చే భక్తులు రెండు దేవాలయా ల్లో పూజలు అందుకోవటం ఇక్కడి పడిపాటి.

ఇలా చేరుకోవాలి...
జిల్లా కేంద్రానికి 102 కిలోమీటర్ల దూర మున్న శ్రీ వెంగమాంబ దేవాలయానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసిం ది. నెల్లూరు నుంచి దుత్తలూరు మీదుగా, పామూరు, ఒంగోలు నుంచి కందుకూరు వాయా పామూరు మీదుగా నర్రవాడకు, అలాగే కడపనుంచి బద్వేలు, ఉదయగిరి దుత్తలూరు మీదుగా బస్సులు నడుపుతారు.

  • Written by:
- బాలినేని మాబయ్య, ఉదయగిరి.--బాషా, దుత్తలూరు.--శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా.
  • ======================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment