Friday, July 15, 2011

ఏటుకూరి వెంకట నరసయ్య,Yetukuri Venkatanarasayya


మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -ఏటుకూరి వెంకట నరసయ్య- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
కవిబ్రహ్మ ఏటుకూరి వెంకట నరసయ్య (జననం: ఏప్రిల్ 1, 1911 - మరణం నవంబర్ 10, 1949) క్షేత్రలక్ష్మి పద్యకావ్యంతో పేర్గాంచిన, మానవతావాది, కవి ఐన ఏటుకూరి వెంకట నరసయ్య , గుంటూర్ జిల్లా, సత్తెనపల్లి తాలూకా పెదకూరపాడు లో , గండికోట కమ్మ కుటుంబంలో, తల్లి తండ్రులకు ఐదుగురు కొమరులులలో రెండవవాడుగా, ఏప్రిల్ 1, 1911 న జన్మించాడు. చినగూడూరు,అమృతలూరు మరియు సిద్ధాశ్రమం (తెనాలి తాలూకా) లో విద్యాభ్యాసం జరిగింది. కవిరాజు త్రిపురనేని ప్రభావంతో పరస తాళ్ళూరు గ్రామానికి చెందిన యువతి తో దండల వివాహం చేసుకొన్నాడు. నలుగురు పిల్లలు. బెంగాలీ సంస్కృతి ప్రభావంతో కుమారులకు రవీంద్రనాథ్ (చనిపోయాడు), హిమాంశు రాయ్ (విశ్రాంత ఉప తహసిల్దారు) అని నామకరణం చేశాడు. కుమార్తెలు ఝాన్సీ లక్ష్మి, మాంచాల. తొలుత గురిజాల ఆ తరువాత నిడుబ్రోలు జిల్లా పరిషత్‌ హైస్కూలులో (1948 -1949 ) అధ్యాపకుడిగా పనిచేశాడు. కొండవీటి వెంకటకవి, అభ్యుదయ మానవతావాది ఐన ఆవుల గోపాలకృష్ణమూర్తి ఇతనికి సన్నిహితులు. ఎం.ఎన్.రాయ్ ఉద్బోధించిన పునర్వికాసం, వైజ్ఞానిక ధోరణి కి ఊతమివ్వటానికై ఆవుల గోపాల కృష్ణమూర్తి త్రిపురనేని, ఏటుకూరి వెంకట నరసయ్య రచనలకు విస్తృతంగా ప్రచారం కల్పించాడు.

రచనలు: క్షేత్రలక్ష్మి -పద్య కావ్యం, పల్నాటి యుద్ధం నేపధ్యంగా పలనాటి వీరచరితము (ఇది ఐదు భాగాలు - అలుగురాజు (రెండు భాగాలు) ,నాయకురాలు, అలరాజు, మాంచాల ), నీతిమంజరి , రైతు హరికధ, సిద్ధాశ్రమము, ప్రేమ లోకం (గ్రామీణ ప్రేమ గాధ), అంగద రాయభారము(లభించుటలేదు).

చందమామ మాస పత్రిక ఈయన నీతి వాక్యాలు ప్రచురించినది . గోవాడలో జరిగిన సాహిత్య పోటీలో రైతుహరికథ ఎంపిక కాగా కవిబ్రహ్మ అని బిరుదు ఇచ్చారు. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాదు, ఏటుకూరి వెంకట నరసయ్య పేరు పై సాహిత్యకృషి చేసిన వారికి ప్రతి సంవత్సరం ఇచ్చేలా ఒక బహుమతిని నెలకొల్పింది.
  • ====================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment