పరిచయం :
- ‘భక్త ప్రహ్లాద (1931)’తో ప్రారంభమైన తెలుగు సినిమా పాట ఎనభయ్యో పడిలో అడుగుపెట్టింది. ఈ ఎనిమిది పదుల కాలంలో సుమారు 400 మంది కవులు దాదాపు 34 వేల పాటల్ని (అనువాద గీతాల్ని మినహాయించి) రాశారు. ముఖ్యమైన జాబితా లో ఎవరు ఎంపిక చేసినా మహా అయితే మరో ఏడెనిమిది మంది కవుల కంటే ఆ జాబితాలో చోటు చేసుకోరు. ఇలా గుర్తింపు పొందిన కవులను కూడా జల్లెడ పడితే, తమ ప్రత్యేకతలతో తెలుగు సినిమా పాటకు దిశానిర్దేశం చేసిన కవులు 12 మంది మాత్రమే అంటే కించిత్ ఆశ్చర్యం కలగక మానదు. అందులో ఒకరు ... ఆరుద్ర గారు .
- తెలంగాణా పోరాట ఇతివృత్తంతో రాసిన ' త్వమేవాహం (1949) కావ్యం చదివి ఇక నేను పద్యాలు రాయక పోయినా పరవాలేదు అని మహాకవి శ్రీశ్రీ ప్రశంస పొందిన వారు ఆరుద్ర . శ్రీశ్రీ తర్వాత యువతరంపై ఎక్కువ ముద్ర పడిన కవిగా పేరు పొందిన ఆరుద్ర అభ్యుదయకవి, పండితుడు, పరిశోధకుడు, నాటక కర్త మరియు విమర్శకుడు.
- అసలు పేరు భాగవతుల సూర్యనారాయణ శంకరశాస్ర్తి. అభ్యుదయ కవిగా, పరిశోధకునిగా, ప్రయోగశాలిగా ప్రసిద్ధులైన ఆరుద్ర, ‘బీదల పాట్లు (1950)’తో గేయకవిగా పరిచయమయ్యారు. పరోపకారం, ప్రేమలేఖలు చిత్రాలకు పాటలతో పాటు మాటల్ని కూడా రాసి ప్రాచుర్యాన్ని పొందారు. సంగీత దర్శకులిచ్చిన బాణీలకు సునాయాసంగా, వేగంగా పాటలు రాయగలిగిన ఆ తరం కవుల్లో ఆరుద్ర అగ్రేసరులు. సంప్రదాయ పరిజ్ఞానం, పాత్రోచిత భాషా ప్రయోగం, అంత్యప్రాసలు ఆరుద్ర ప్రత్యేకత. వ్యంగ్య, హాస్య, చారిత్రక స్థల, సామ్యవాద గీతాలు రాయడంలో ఆరుద్ర ముద్ర గమనార్హం. ముద్దుబిడ్డ, ఎం.ఎల్.ఎ., ఉయ్యాల-జంపాల, వీరాభిమన్యు, ముత్యాలముగ్గు, గోరంత దీపంలాంటి చిత్రాల్లో 2,500 పాటల్ని రాశారు
- ==========================================
No comments:
Post a Comment