ఆంధ్ర ప్రదేశ్ లోని అనంతపురం జిల్లా, ఇల్లూరు గ్రామంలో 1913 మే 18 న రైతుబిడ్డగా సంజీవరెడ్డి జన్మించాడు. మద్రాసు థియొసోఫికల్ పాఠశాలలోను, అనంతపురం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలలోను చదువుకున్నాడు. 1935 జూన్ 8 న నాగరత్నమ్మను పెళ్ళి చేసుకున్నాడు. వారికి ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
ఇప్పటివరకూ మన దేశానికి అధ్యక్షులుగా పనిచేసిన, చేస్తున్న పన్నెండు మందిలో ముగ్గురు తెలుగు వారు కావడం విశేషం. వారిలో మూడవవారు, అధ్యక్షుల్లో ఆరవవారు అయిన నీలం సంజీవరెడ్డి గారికి కొన్ని ప్రత్యేకతలున్నాయి.
గాంధీజీ ప్రభావంతో చదువును త్యాగం చేసి 1931 లో స్వాతంత్ర్యోద్యమంలోకి దూకారు. 1946 లో మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత రాజ్యాంగ రచనా సంఘంలో సభ్యుడిగా పనిచేసారు.
1956 లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి గా పనిచేసిన ఘనత ఆయనది . అంతేకాదు రెండోసారి కూడా 1962 నుంచి 64 వరకూ ముఖ్యమంత్రిగా పనిచేసారు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసారు.
మరణము -- 01 జూన్ 1996
For full details - > Neelam Sanjeeva Reddy
- =====================================
No comments:
Post a Comment