మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -మంగళంపల్లి బాలమురళీకృష్ణ- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....
- మంగళంపల్లి బాలమురళీకృష్ణ--కర్నాటక సంగీతాన్ని సుసంపన్నం చేసిన మహానుభావులెందరో వున్నారు. అయితే కర్నాటక సంగీతం అనగానే ఈ తరంలో వెంటనే స్పురణకు వచ్చే పేరు మంగళంపల్లి బాలమురళీకృష్ణ. సంగీతాన్ని ఔపోసన పట్టిన మహానుభావుడు బాలమురళి. కర్ణాటక సంగీత ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన బాలమురళి వాగ్గేయకారుడు. త్యాగయ్య లాంటి వాగ్గేయకారులు రచించిన ఎన్నో కీర్తనలకు జీవం పోసిన బాలమురళి స్వయంగా కీర్తనలు రాసారు. కొత్త రాగాలు కనిపెట్టారు.
- కోనసీమలోని శంకరగుప్తంలో సంగీత కుటుంబంలో పుట్టిన బాలమురళి త్యాగరాజు శిష్యపరంపరకు వారసుడైన బ్రహ్మశ్రీ పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి దగ్గర శిష్యరికం చేశారు. ఆయన ఎనిమిదేళ్ళ వయసులో విజయవాడలో త్యాగరాజ గాన సభలో తొలి పూర్తి స్థాయి కచేరి చేశారు.
- ======================================
No comments:
Post a Comment