Tuesday, August 2, 2011

రఘుపతి వెంకటరత్నం నాయుడు, Raghupathi Venkataratnam Naidu



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -రఘుపతి వెంకటరత్నం నాయుడు- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



రఘుపతి వెంకటరత్నం నాయుడు 1862 అక్టోబర్ 1న మచిలీపట్నంలో సుప్రసిద్ద తెలగ నాయుళ్ళ ఇంట జన్మించాడు. తండ్రి అప్పయ్యనాయుడు సుబేదారుగా పనిచేస్తూ ఉత్తరభారతాన ఉండడంతో నాయుడు విద్యాభ్యాసం చాందా (చంద్రపూర్)నగరంలో మొదలయింది. హిందీ, ఉర్దూ, పర్షియన్ భాషలలో ప్రవేశం కలిగింది. తండ్రికి హైదరాబాదు బదిలీ కావడంతో, అక్కడి నిజాం ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించాడు. తరువాత మద్రాసు క్రిస్టియన్ కళాశాలలో పట్టభద్రుడై, తరువాత ఎం.ఏ, ఎల్.టి కూడా పూర్తిచేసాడు.

రావు బహద్దూర్ రఘుపతి వెంకటరత్నం నాయిడు గారు కందుకూరి వీరేశలింగం గారి శిష్యులు. ఆయనలాగే నాయుడు గారు కూడా సంఘసంస్కరణాభిలాషి. అంటరానితన నిర్మూలనకు కృషి చేసి కాకినాడలో అనాధలైన హరిజన బాలబాలికలకు ఆశ్రమం కట్టించారు. దేవదాసీ వ్యవస్థ నిర్మూలనకు, కులాంతర వివాహాలకు, విధవా పునర్వివాహాలకు కృషి చేశారు. బ్రహ్మ సమాజ ఉద్యమంలో చురుకుగా పాల్గొని ' బ్రహ్మర్షి ' బిరుదు పొందారు.

ఆయన అధ్యాపకులుగా కూడా ప్రసిద్ధి చెందారు. సికిందరాబాదు మెహబూబ్ కళాశాలకు, కాకినాడ పిఠాపురం రాజా కళాశాలకు ప్రధానాచార్యులుగా పనిచేశారు. అంతకుముందు ఆయన స్వస్థలం మచిలీపట్నంలో అధ్యాపకులుగా పనిచేశారు.

For more Details --> Raghupati venkataratnam Naidu
  • =========================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment