Monday, August 1, 2011

పాలగుమ్మి సాయినాథ్ , Palagummi Sainath



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -పాలగుమ్మి సాయినాథ్ - గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


"ది హిందూ" పత్రిక రూరల్ అఫైర్స్ ఎడిటర్ గా పనిచేస్తున్న ప్రముఖ జర్నలిస్టు పాలగుమ్మి సాయినాథ్ గారి గురించి వినని జర్నలిస్టు ఉండరు. ఆయనను ఆరాధించని జర్నలిస్టులూ కనిపించరు. జర్నలిజం ఇంత నీచమైన పేరు తెచ్చుకుంటున్న రోజుల్లోనూ గ్రామీణ ప్రాంతాల సమస్యలను అద్భుతంగా ఆవిష్కరించి...పాలకులు కదిలేట్టు చేయడంలో ఆయన దిట్ట.

పాలగుమ్మి సాయినాథ్ భారత దేశంలో పేరు గాంచిన జర్నలిస్టులలో ఒకరు, జర్నలిజం విభాగంలో 2007వ సంవత్సరపు రామన్ మెగసెసె అవార్డు గ్రహీత. జర్నలిస్టు అని పిలిపించుకునే కన్నా, 'పల్లె రిపోర్టరు' లేదా 'రిపోర్టరు' అని పిలువబడటాన్ని ఇష్టపడతారు. పల్లె రైతులు, పేదరికం వంటి విషయాలను వెలుగులోనికి తీసుకురావడానికి ఎంతో కృషి చేసారు, చేస్తున్నారు. గత పధ్నాలుగు సంవత్సరాలుగా ఆయన సంవత్సరానికి 270-300 రోజులు పల్లెల్లో గడుపుతున్నారు. హిందూ పత్రికలో గ్రామీణ వ్యవహారల ఎడిటర్‌గా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. ఈయన చేసిన పనిని మెచ్చి నోబెల్ అవార్డు గ్రహీత అమర్త్య సేన్‌ "ఆకలి, కరువుల వంటి విషయాలపై నేడు ప్రపంచంలోని ఉత్తమ పరిశోధకులలో ఒకరు" అని ప్రశంచించారు.

మీడియా అంటే జర్నలిజమని అపోహపడవద్దని అన్నారు. ABCD of media ను "Advertising", "Bollywood", "Cricket" and "Developers" గా చెప్పారు. అత్యున్నతస్థాయిలో అసమానతలున్న భారతదేశాన్ని ఏ వ్యవస్థా కాపాడలేదని పాలగుమ్మి సాయినాథ్‌ తేల్చి చెప్పారు.

సాయినాథ్‌ గురించి :

మాజీ రాష్ట్రపతి వివి గిరి మనవడు. ఆంధ్రప్రదేశ్‌ లయోలా కాలేజీలో విద్యాభ్యాసం చేశారు. ఉన్నత విద్యాభ్యాసమంతా జవహర్‌ నెహ్రూ యూనివర్శిటీలో జరిగింది. అదే కాలేజీకి ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా ఉన్నారు. 1980లో జర్నలిస్టుగా యుఎన్‌ఐలో అరంగేట్రం చేశారు. 'బ్లిట్జ్‌' పత్రికలో న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. పదహైదు సంవత్సరాలుగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఎన్నో కథనాలను పాఠకులకు అందించారు. వ్యవసాయ సంక్షోభాన్ని, రైతుల ఆత్మహత్యలను, దళితుల పట్ల వివక్షను జాతీయ అజెండాగా మార్చిన ఘనత ఆయనకే దక్కింది. ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ కమిషన్‌ ఏర్పాటు చేయించడంలో ప్రత్యేక పాత్ర పోషించారు. ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, ఒరిస్సా రాష్ట్రాలలో 1990 నుంచి 2000 మధ్యకాలంలో 1800 మంది రైతులు పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకోగా, ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కేవలం 54 మంది మాత్రమే చనిపోయారని, మిగతావారంతా ప్రేమవిఫలం, భార్యాభర్తల గొడవలు, పరీక్షల్లో విఫలం తదితర కారణాల వల్ల జరిగాయని తప్పుడు లెక్కలు ఇచ్చింది. ప్రజా జర్నలిస్టు అయిన సాయినాథ్‌ ఆంధ్రరాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో క్షేత్రస్థాయిలో పరిశీలించి 1061 మంది అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకున్నారని తేల్చారు. తన రచనల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆ సందర్భంగానే ప్రభుత్వం కొత్తరకమైన
పురుగుల మందు ఉచితంగా ఇచ్చిందన్న విషయాన్ని పేర్కొన్నారు. వేయాండ్‌, ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్రలలో దళితుల వివక్ష, వారు ఎదుర్కొంటున్న సమస్యలను కళ్లకు కట్టినట్లు వివరించారు. 15 రాష్ట్రాల్లో లక్షా 50వేల కిలోమీటర్ల దూరం తిరిగి వ్యాసాలను అందించారు. దళితులు, రైతుల సమస్యలు, ఇతర ప్రజా సమస్యలను పుస్తక రూపంలో తీసుకురానున్నారు.

సాయినాథ్‌ రచించిన 'ఎవ్రిబడీ లైక్స్‌ ఎ గుడ్‌ డ్రాట్‌' పుస్తకానికి అంతర్జాతీయంగా ప్రతిష్టాత్మకమైన మెగసెసె అవార్డు 2007లో లభించింది.
  • ====================================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment