Thursday, August 4, 2011

డా వై. నాయడమ్మ ,Dr. Yelavarthy Nayudamma



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -డా వై. నాయడమ్మ ,Dr. Yelavarthy Nayudamma- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....


10-9-1922న గుంటూరు జిల్లా యలపర్తి లో జన్మించారు. వీరి ఇంటి పేరు కూడా యలపర్తి. లెహై యూనివర్సిటీ (అమెరికా) నుండి లెదర్‌ కెమిస్ట్రీలో యం.ఎస్‌., పి.హెచ్‌.డీ డిగ్రీ లు పొందారు. వీరు అంతర్జాతీయ ఖ్యాతినా ర్జించిన చర్మ సాంకేతిక శాస్తవ్రేత్త. న్యూఢిల్లీ లోని జవహర్‌లాల్‌ నెహ్రూ విశ్వవిద్యాలయాని కి (1981-82) ఉపకులపతిగా పనిచేశారు. సి.యస్‌.ఐ.ఆర్‌కు (1971-77) డైరెక్టర్‌గా పనిచేశారు. 1983లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభు త్వం వీరిని రాష్ట్ర శాస్తవ్రిజ్ఞానరంగ గౌరవ సల హాదారుగా నియమించింది. మాంట్రియల్‌ లో జరిగిన ఒక సెమినార్‌కు వెళ్ళి తిరిగి వస్తూ... 23-6-1985న విమాన ప్రమాదం లో మరణించారు.

For more information - > Nayudamma Dr.
  • =========================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment