మాతంగి విజయరాజు గుంటూరు జిల్లా బాపట్ల, విజయరాజుకు భార్య, ముగ్గురు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్రను దాదాపు 2వేల సార్లు పోషించి
రాష్ట్ర వ్యాప్తంగా అసంఖ్యాకంగా అభిమానులను సంపాదించుకున్నారు. స్థానం నరసింహారావు తర్వాత స్త్రీ పాత్రలు పోషించడంలో పేరుగాంచారు.
మధుర స్వరం, అసమాన నటనా ప్రతిభతో భావపురి నాటక కళారంగంలో ధ్రువతారగా ఎదిగిన ఎం.విజయరాజు చెరగని ముద్ర వేశారు. హరిశ్చంద్ర నాటకంలో చంద్రమతి పాత్ర పోషణలో
దిట్టగా పేరుగాంచారు. సామాన్య నిరుపేద దళిత కుటుంబంలో జన్మించిన ఆయన గత 32 ఏళ్లుగా కళామతల్లి సేవ చేస్తూ ఆరు వేల ప్రదర్శనలు ఇచ్చారు. విజయరాజు గుండెపోటుతో
హఠాత్తుగా 07/08/2011 na మరణించడం కళాభిమానులను దుఃఖసాగరంలో ముంచింది.
బాపట్ల మూర్తి రక్షణ నగర్‌కు చెందిన విజయరాజు ఐదో తరగతి చదువుతుండగానే లోహితాస్యుని పాత్రను పోషించి రంగస్థల నటుడిగా తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. బాపట్ల ఆర్ట్స్ అండ్
సైన్స్ కళాశాలలో చదువుతున్న సమయంలో ఎం. రామకృష్ణారావు వద్ద సంగీతం నేర్చుకున్నారు. మధుర గాత్రంతో లయబద్ధంగా పాటలు, పద్యాలు ఆలపించి గానకోకిలగా బిరుదును
పొందారు. అంతర కళాశాలల నాటక పోటీల్లో ఉత్తమ నటుడు, దర్శకుడు, ఉత్తమ పదర్శనల పురస్కారాలను కైవసం చేసుకున్నారు. సాంఘిక, పౌరాణిక నాటికల్లో అసమాన నటనా
ప్రతిభను కనబరిచారు. చింతామణి, శిలువుధారి, మోక్షాభిషేకం, రామాంజనేయ యుద్ధం తదితర నాటకాలు ప్రదర్శించి రంగస్థలంలో తనదంటూ ప్రత్యేక ఒరవడిని సృష్టించారు. ప్రముఖ
రంగస్థల నటులు కె.ఎస్.టి. సాయి, మధురకవి కె.వి.ఎస్. ఆచార్యలను గురువులుగా భావించేవారు. నాటక పోటీల్లో పాల్గొని ఎన్నో అవార్డులు, రివార్డులను గెలుచుకున్నారు.
- ==========================================
గొప్ప గాయకుడు.విజయరాజు బాపట్ల సాల్వేషన్ ఆర్మీ హైస్కూల్ లో నాకు సీనియర్.స్కూలు పాటల కార్యక్రమాల్లో కొన్ని సార్లు ఇద్దరం కలిసి పాల్గొన్నాము.మూర్తి రక్షణ నగరానికి చెందిన కళ్యాణసుందరం మాస్టారు,రాణి టీచర్ లాంటివారు మాచేత పాడించేవారు.
ReplyDeleteకారణజన్ములు
ReplyDelete