Thursday, September 8, 2011

వావిలాల గోపాల కృష్ణయ్య,



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -వావిలాల గోపాల కృష్ణయ్య- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

అక్టోబర్‌ 17న విజయ దశమి నాడు స్వాతంత్య్ర సమర యోధుడు, గాంధేయవాది, అధికార భాషా సంఘం అధ్యక్షుడుగా కృషి చేసిన మహనీయుడు వావిలాల గోపాల కృష్ణయ్య 105వ జయంతి. శాసన సభలో 20 సంవత్సరాలు శాసన సభ్యుడిగా ఆయన చేసిన ప్రసంగాలు రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో శాశ్వతంగా నిలచిపోతాయి. ఆయన బడ్జెట్‌పై మాట్లాడినా, కృష్ణ- గోదావరి జలాల పంపిణీపై ప్రసంగించినా, రాజ్యాంగ సవరణ, పత్రికా స్వేచ్ఛ- ఇంకా అనేక విషయాలపై ప్రభుత్వంపై చేసిన విమర్శలు, నిష్కర్షగా, నిజాయితీగా ఇచ్చిన సలహాలు నేటికీ శిరోధార్యాలు.

for more details - వావిలాల గోపాల కృష్ణయ్య,
  • =====================================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment