ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రోద్యమ నాయ కుడు, ఆంధ్రా బ్యాంక్ స్థాపకుడు అయిన డా భోగరాజు పట్టాభి సీతారామయ్య తేదీ-24/11/1880వ సంవత్సరంలో పశ్చిమ గోదావరి జిల్లాలో జన్మించారు. 1906లో మచిలీపట్నంలో వైద్యవృత్తిని చేపట్టారు. గాంధీజీ పిలుపు మేరకు 1916 లో ఆ వృత్తిని వదిలిపెట్టి స్వాతంత్య్రోద్య మంలో పాల్గొన్నారు. అంతే కాకుండా భారత్‌కు స్వాతంత్య్రం సిద్ధించే వరకు ఎటువంటి వృత్తిని చేపట్టకూడదనే ధ్యేయంతో ముందుకు నడిచారు. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్రను రెండు భాగాలు గా రచించారు. 1948లో జైపూర్ కాంగ్రెస్ సమావేశం నాటికి కాంగ్రెస్ అధ్యక్షుని స్థాయి కి ఎదిగారు. 1952-57 మధ్యకాలంలో మధ్యప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా వ్యవరించారు. నేడు దేశంలో ప్రముఖ బ్యాంకుగా చలామణి అవుతున్న ఆంధ్రాబ్యాంక్‌ను 1923లో స్థాపిం చాడు. అంతేకాకుండా ఈయన స్థాపించిన ఆంధ్ర ఇన్సూరెన్స్ కంపెని (1925), హిందు స్తాన్ ఐడియల్ ఇన్సూరెన్స్ కంపెని (1935) లు తరువాతి కాలంలో ఇన్సూరెన్స్ కార్పొరేషన్‌లో విలీనమయ్యాయి. డిసెంబర్ 17, 1959వ సంవత్సరంలో భోగరాజు పట్టాభిసీతారామయ్య మరణించారు.
మరింత సమాచారము కోసం --> డా భోగరాజు పట్టాభి సీతా రామయ్య
- =====================================
No comments:
Post a Comment