ఉప్పులూరి గోపాలకృష్ణ మూర్తి ఒక సుప్రసిద్ధ తత్వవేత్త. యూజీ గా సుప్రసిద్ధుడు. ఆయన జులై 9, 1918 న కోస్తాంధ్ర ప్రాంతానికి చెందిన మచిలీపట్నం లో జన్మించాడు. గుడివాడ లో పెరిగాడు. ఆయన తల్లి ఇతనికి జన్మనిచ్చిన ఏడురోజులకే కన్నుమూసింది. అప్పుడు ఆయన అమ్మమ్మ అతన్ని పెంచి పెద్దచేసింది. ఆమె ఒక సంపన్న బ్రాహ్మణ కుటుంబానికి చెందిన పేరొందిన న్యాయవాది. దివ్యజ్ఞాన సమాజం కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉండేది. అలా యూజీ కూడా టీనేజీ లోనే ఆ సమాజంతో పరిచయం కలిగింది.
ఎక్కువకాలము విదేశాలలో గడిపి తనదైన ఫిలాసఫీని ప్రజలకు పంచిన వ్యక్తి యు.జి. 2007 లో ఆయన మరనించారు తర్వాతనె తెలుగువారు అటువంటి తత్వవేత్త ఒకరున్నారని తెలుసుకున్నారు . యు.జి. ఫిలాషఫీ '' ఏదీ అసత్యము కాదు .. ఏదీ సత్యము కాదు అంతా మిధ్య అన్నట్టుగా సాగుతుంది . '' జ్ఞానోదయం " అనేది లేనే లేదంటారు . దినవారీ కార్యక్రమాల నిర్వహణకు జ్ఞానము అవసరమే . ఐతే ఆ జ్ఞానము రావడమే జ్ఞానోదయమా! అని ప్రశ్నిస్తారు . ఆలోచనల ప్రభావం తాత్కాలికమే తప్పించి శాశ్వత పరిష్కారం చూపించేఆలోచనలే లేవన్నారు . ఆలోచన అనేది ఏ రూపం లో అంగీకరించలేదు . ఆలోచనాపరమైన విజ్ఞానము కూడా మిధ్యేనని అన్నారు .
- ==================================
No comments:
Post a Comment