Sunday, November 27, 2011

తలిశెట్టి రామారావు , Thalisetti Ramarao




మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -తలిశెట్టి రామారావు , Thalisetti Ramarao- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

మన తెలుగు పత్రికలలో వ్యంగ్య చిత్రాలు ప్రచురించబడటం 80 ఏళ్ళ క్రితమే మొదలయింది. ఇందుకు ఆద్యులు శ్రీ తలిశెట్టి రామారావుగారు . తలిశెట్టి రామారావు (1906 - 1960) తొలి తెలుగు కార్టూనిస్ట్ (వ్యంగ్య చిత్రకారుడు). ఇతని కార్టూన్లు భారతి పత్రికలో ఒక పూర్తి పేజీలో వచ్చేవి. ఇతన్ని తెలుగు కార్టూన్ పితామహుడిగా పిలుస్తారు. మన కార్టూనిస్టులలో చాల మంది ఆంధ్ర పత్రిక ద్వారానే వెలుగులోనికి వచ్చారన్నది నిజం. తరువాత మిగిలిన పత్రికలు కూడా కార్టూన్లను గుర్తించడం మొదలు పెట్టాయి.

  • వ్యక్తిగత వివరాలు

1906లో జయపురంలో జన్మించాడు. గిడుగు రామమూర్తి పంతులు కుమారుడు గిడుగు సీతాపతి వద్ద శిష్యరికం చేశాడు. బాల్యంలోనే తండ్రి మరణించాడు. జీవనం కోసం తల్లితో కలిసి దర్జీపని చేశాడు. ఆ తరువాత కార్టూన్లు గీయటంలో ఈ వృత్తి లోని అనుభవం కూడా దోహదం చేసింది. ఉన్నత విద్య జయపురంలోనూ, ఆ తరువాత పర్లాకిమిడి, ఆ తరువాత విజయనగరంలో బి.యే చదివాడు. ఆర్థిక కారణాల వల్ల చదువు ఆగిపోయి, ఆ తరువాత జయంపురం రాజా వారి సహాయంతో మద్రాసులో న్యాయశాస్త్రంలో పట్టా పుచ్చుకున్నాడు. అనంతరం పార్వతీపురంలో న్యాయవాద వృత్తి చేపట్టారు. మద్రాసులో ఉన్నప్పుడే కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుతో పరిచయం కలిగి వీరు గీచిన కార్టూన్లు ఆంధ్రపత్రిక మరియు భారతి పత్రికల్లో ప్రచురించటానికి దోహదమయింది. తొలుత బొమ్మలు మాత్రమే వేసేవాడు, అయితే ఆ తరువాత గిడుగు సలహాపై మాటలు కూడా కలిపి కూర్టూన్ శకానికి నాంది పలికాడు.

  • రచనలు

1. భారతీ , ఆంధ్ర పత్రికల్లో కార్టూన్లు
2. 1930వ సంవత్సరంలో భారతీయ చిత్రకళ అనే పుస్తకం. వావిళ్లవారి ప్రచురణ.



  • ==============================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment