- image source : wikipedia.org
వృత్తి రీత్యా గణిత శాస్త్ర ఉపాధ్యాయులు. వేళ్ళమీద లెక్కపెట్టదగిన తెలుగు హస్య రచయితలలో అగ్రగణ్యులు. కచటతపలు, బాగు బాగు, తమ్ముడిపెళ్ళికి తరలి వెళ్ళడం మొదలైన ఎన్నో హాస్య నాటకాలు, నాటికలు రాశారు. నాటకాల్లో గానం కన్నా రాగానికి ప్రాధాన్యమివ్వటం వల్ల రసభంగమవు తుందని విమర్శిస్తూ వ్యాసాలు రాశారు. తాను రాసిన నాటకాలకు దర్శకత్వం వహించి, నటించి ప్రేక్షకుల ప్రశంసలం దుకున్నారు. రచయితగా, గాయకునిగా, నటునిగా, దర్శకునిగా, ఉత్తమ ఉపాధ్యాయునిగా, సంఘ సంస్కర్తగా పేరు పొందారు. అభిమానులు ‘హాస్య బ్రహ్మ’ అనే బిరుదు నిచ్చారు.
వీరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో ఏప్రిల్ 28, 1897 సంవత్సరంలో నరసావధానులు, లచ్చమ్మ దంపతులకు జన్మించారు. వీరు భీమవరంలో పాఠశాల విద్యను పూర్తి చేసి, ప్రతిభావంతులైన విద్యార్ధులకిచ్చే ఉపకార వేతనం సహాయంతో, పిఠాపురం మహారాజా కళాశాలలో గణితంలో పట్టా పొందారు. తరువాత కొంతకాలం నరసాపురం మరియు కాకినాడలలో ఉపాధ్యాయునిగా పనిచేశారు. 1922లో ఎల్.టి పరీక్షలో ఉత్తీర్ణులై రాజమండ్రి వీరేశలింగం ఆస్తిక ఉన్నత పాఠశాలలో గణిత శాస్త్ర అధ్యాపక పదవిలో స్థిరపడి, అదే పాఠశాలకు రెండు సంవత్సరాలు ప్రధానోధ్యాపక బాధ్యతలను కూడా నిర్వహించారు. ఉపాధ్యాయునిగా పనిచేస్తూ వీరు చాలా నాటకాలు, నాటికలు, కథలు రచించారు. సమకాలీన సాంఘిక సమస్యలను వీరి రచనలలో హాస్యరసానురంజకంగా మలచిన ప్రజ్ఞాశాలి అవటం వలన పండితలోకం వీరిని హాస్య బ్రహ్మ అని కొనియాడారు. త్యాగరాజు రచనలను, జీవితాన్ని చక్కగా పరిశీలించి రాగ, తాళ, వాద్యాలను ఆ గాయకుని భావానికి అనుగుణంగా సమకుర్చునని వివరిస్తూ 'త్యాగరాజు ఆత్మ విచారం' రచన చేశారు. తన అభిప్రాయాలకు అనుగుణంగా రచించిన తన నాటకాలను వీరు రాజమండ్రి కళాశాల వార్షికోత్సవాలలో వీరే దర్శకత్వం వహించి ప్రదర్శించేవారు. వీరు స్వయంగా నటులు. ద్విజేంద్రలాల్ రచించిన 'చంద్రగుప్త'లో శక్తి సింహ పాత్రను పోషించి ఖ్యాతిని పొందారు.
ఉత్తమమైన హాస్య రచనలతో ఎందరినో మనసారా నవ్వించిన వీరు 1958, ఆగష్టు 28న పరమపదించారు.
For more details -> Bhamidipati Kameswararao (Telugu)
- ============================
No comments:
Post a Comment