Thursday, November 15, 2012

Yarlagadda Lakshmi prasad-యార్లగడ్డ లక్ష్మీప్రసాద్

  • మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ --Yarlagadda Lakshmi prasad-యార్లగడ్డ లక్ష్మీప్రసాద్-- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....



నవంబర్ 24, 1953లో కృష్ణా జిల్లా గుడివాడ లో జన్మించిన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్యుడు. హిందీలో యం.ఎ. పట్టా పొంది, తెలుగు, హిందీ భాషలలో పి.హెచ్.డి. పట్టాలు సాధించాడు. నందిగామ కె.వి.ఆర్ కళాశాలలో అధ్యాపకునిగా, ఆంధ్ర లయోలా కళాశాలలో హిందీ విభాగపు అధ్యక్షునిగా పనిచేసిన పిదప ఆంధ్ర విశ్వకళా పరిషత్, హిందీ విభాగములో ఆచార్య పదవి పొందినాడు. ఆచార్యునిగా 29 మంది విద్యార్థులకు పి.హెచ్.డి. మార్గదర్శకము చేశాడు. హిందీ భాష, సాహిత్యములలో విశేష కృషి చేస్తున్నాడు. పలు తెలుగు గ్రంథాలు హిందీలోకి అనువాదము చేశాడు. తెలుగులో 32 పుస్తకాలు రచించాడు. రాజ్యసభ సభ్యునిగా కూడ సేవలందించాడు.


లక్ష్మీప్రసాద్‌ ప్రతిష్ఠాత్మక సాహిత్యఅకాడమీ అవార్డు-2009కి ఎంపికయ్యారు. ఆయన రాసిన 'ద్రౌపది' తెలుగునవలకుగాను ఈ పురస్కారం వరించింది. లక్ష్మీప్రసాద్‌కు సాహిత్యఅకాడమీ అవార్డురావడం ఇది రెండోసారి. బిషన్‌సహానీ రాసిన 'తామస్‌' అనే హిందీపుస్తకాన్ని తెలుగులోకి అనువదించినందుకు 1992లో ఆయన సాహిత్యఅకాడమీ అనువాద అవార్డును పొందారు. కాగా, ఈ సారి ద్రౌపది పాత్రలో స్త్రీ ఔన్నత్యాన్ని విలక్షణంగా ఆవిష్కరించినందుకు సాహిత్య అకాడమీ సృజనాత్మక అవార్డుకు ఆయన ఎంపికయ్యారు. ఒకే రచయిత రెండుసార్లు ఈ గౌరవాన్ని అందుకోవడం ఇదే తొలిసారి.


పురస్కారాలు, పదవులు :

  •     పద్మశ్రీ - 2003
  •     కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారము - 1992
  •     తానా Human Exellency Award - 2008
  •     జాతీయ హిందీ అకాడెమి - విశిష్ఠ హిందీ సేవా సమ్మాన్ - 2009
  •     అధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ హిందీ అకాడమీ
  •     అధ్యక్షుడు,లోక్ నాయక్ ఫౌండేషన్
  •     కేంద్ర సాహిత్య అకాడెమీ బహుమతి - ద్రౌపది నవల - 2009

  • మూలము : తెలుగు వికీపెడియా వెబ్ సైట్ .
  • ==================
Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment