స్వాతంత్య్ర సమరయోధుడు, గాంధేయవాది నాగులపల్లి సీతారామయ్య(99) కన్నుమూశారు. కృష్ణా జిల్లా ముదునూరుకు చెందిన ఆయన హైదరాబాద్‌లోని తన కుమారుని ఇంట్లో ఆదివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. పునాదిపాడులో 1930లో ఉన్నతపాఠశాలలో చదువుతుండగా ఉప్పు సత్యాగ్రహానికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలో అజ్ఞాత కార్యకర్తగా చేరారు. 1942లో ఆయన 'రడీ' అనే పేరుతో రాత్రివేళ రహస్యంగా పత్రిక ముద్రిస్తూ అరెస్త్టె జైలుకు వెళ్లారు. జిల్లా గ్రంథాయాల సంఘానికి 18 ఏళ్లు కార్యదర్శిగా, జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల కమిటీకి ఐదేళ్లు కార్యదర్శిగా పనిచేశారు. సీతారామయ్య రాష్ట్ర గ్రంథాయాల సంఘానికి కార్యనిర్వహక కార్యదర్శిగానూ సేవలందించారు. కృష్ణా జిల్లా ముదునూరులో 1953లో ఉన్నతపాఠశాలను స్థాపించారు. దాదాపు 37 ఏళ్లు ఉపాధ్యాయుడిగా పనిచేశారు. విజయవాడలో ఆయన పేరుతోనే సమరయోధుల భవనం ఉంది
-ఈనాడు, హైదరాబాద్.
- =============================
No comments:
Post a Comment