Friday, June 7, 2013

Laxminarayana C.B.I(JD) , లక్ష్మీనారాయణ సీబీఐ(జేడీ)

  •  



మానవులు పుడతారు ... చనిపోతారు . కొంతమంది మాత్రమే తమ జీవితం లో ప్రజలకు ఉపయోగపడే సేవాకార్యక్రమాలు చేసి తమ జీవితాన్నే ఫణం గా పెట్టి మానవ జాతిలో చిరస్థాయిగా తరతరాలుగా నిలిచిపోతారు ... వీరిని "మృతంజీవులు" అని అంటారు . కోటాను కోట్ల జనం లో బహు కొద్ది మంది మాత్రమే ఇలాంటివారు ఉంటారు . ప్రపంచము లో ప్రతి జాతి లోనూ ఈ తరహా మహానుభావులు పుట్టి తమ సేవలతో పుణీతులయ్యారు . తెలుగు జాతికి మణిపూసలైన కొందరి మహానుభావులను తెలుసుకునే ప్రయత్నం లో ఇక్కడ -Laxminarayana C.B.I(JD) ,  లక్ష్మీనారాయణ సీబీఐ(జేడీ)- గురించి తెలుసుకొని మన జీవితాన్ని చక్కని మార్గములో ప్రయాణించే ప్రయత్నం చేద్దాము ....

C.B.I(JD)Laxminarayana , సీబీఐ(జేడీ) లక్ష్మీనారాయణ


సంచలనాత్మక కేసుల దర్యాప్తునకు చిరునామాగా మారిన సీబీఐ హైదరాబాద్‌ విభాగం జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీ) లక్ష్మీనారాయణ మహారాష్ట్ర వెళ్ళిపోతున్నారు. డిప్యుటేషన్‌పై ఏడేళ్లు సొంత రాష్ట్రంలో సేవలు అందించిన ఆయన గడువు పూర్తయింది. దీంతో ఆయనను విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ సీబీఐ ప్రధాన కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆయన స్థానంలో చెన్నై సీబీఐ విభాగానికి జేడీగా వ్యవహరిస్తున్న అరుణాచలానికి అదనపు బాధ్యతలు అప్పగించారు. శని, ఆది వారాలు సీబీఐకి సెలవు దినాలుకావడంతో లక్ష్మీనారాయణ సోమవారం రిలీవ్‌ అయ్యే అవకాశం ఉంది.

కర్నూలు జిల్లాకు చెందిన లక్ష్మీనారాయణ మహారాష్ట్ర క్యాడర్‌ ఐపీఎస్‌ అధికారి. డీఐజీ హోదాలో ఉన్నప్పుడే కేంద్రానికి డిప్యుటేషన్‌పై వెళ్ళి సీబీఐలో బాధ్యతలు చేపట్టారు. సీబీఐ డీఐజీగా 2006 జూన్‌లో సొంతరాష్ట్రమైన హైదరాబాద్‌లో విధుల్లో చేరారు. మొదట్లో ఆయన గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. ఆయన వచ్చిన కొత్తలో తొలుత ఫోక్స్‌ వ్యాగన్‌ కేసు నమోదైంది. ఆ తర్వాత హైకోర్టు ఆదేశాల మేరకు వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయంలో తలపెట్టిన అవుటర్‌ రింగ్‌రోడ్డులో భూసేకరణ, అందులో జరిగిన అక్రమాలకు సంబంధించి దర్యాప్తు జరిపి న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఇది సద్దుమణిగేలోపే సత్యం కంప్యూటర్స్‌ కుంభకోణం కేసు సీబీఐకి బదిలీ అయింది. రూ.ఏడు వేలకోట్ల కుంభకోణానికి సంబంధించిన ఈ కేసుపై సమర్థంగా దర్యాప్తు జరిపిన లక్ష్మీనారాయణ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఈ కేసు కొలిక్కి వచ్చేలోపే దాదాపు ఒకే సమయంలో ఓబుళాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసు, జగన్‌ అక్రమ ఆస్తుల కేసు, ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులు నమోదయ్యాయి. ఇవన్నీ ప్రజాప్రతినిధులు తమ అధికారాన్ని అడ్డంపెట్టుకొని భారీగా అక్రమాలకు పాల్పడ్డ కుంభకోణాల కేసులే. ఓఎంసీ కేసు దర్యాప్తులో భాగంగా కర్ణాటక ఎంపీ గాలి జనార్దనరెడ్డి, ఓఎంసీ ఎండీ శ్రీనివాసరెడ్డిలను అరెస్టు చేయడంతో లక్ష్మీనారాయణ వార్తల్లో వ్యక్తి అయ్యారు. అది మొదలు ఓఎంసీ కేసులో వరుసగా అరెస్టులు జరిగాయి. సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి, మైనింగ్‌ శాఖ ఉన్నతాధికారి రాజ్‌గోపాల్‌ తదితరులను అరెస్టు చేశారు. దీంతోపాటు ఎమ్మార్‌ ప్రాపర్టీస్‌ కేసులో పారిశ్రామికవేత్త కోనేరు ప్రసాద్‌, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి బి.పి.ఆచార్యలను అరెస్టు చేశారు. ఇదే సమయంలో జగన్‌ అక్రమ ఆస్తుల కేసు దర్యాప్తులో భాగంగా మరో ప్రముఖ పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌, అప్పటి మంత్రి మోపిదేవి వెంకట రమణ తదితరులతోపాటు కడప ఎంపీ జగన్‌ను కూడా అరెస్టు చేశారు. ఈ అరెస్టులు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. జగన్‌ అక్రమ ఆస్తుల కేసు విషయంలోనే హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావులు తమ పదవులు పోగొట్టుకున్నారు. మరో ఇద్దరు ముగ్గురు మంత్రుల తలలపై కత్తి వేలాడుతోంది.

ఈ కేసుల దర్యాప్తు జరుగుతుండగానే ఓఎంసీ కేసులో అరెస్టయిన గాలి జనార్దనరెడ్డికి అక్రమ పద్ధతుల్లో బెయిల్‌ ఇప్పించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపైనా సీబీఐ కన్నేసింది. న్యాయమూర్తులకు పెద్దఎత్తున డబ్బు ముట్టజెప్పి బెయిల్‌ ఇప్పించేందుకు ప్రయత్నాలు జరిగాయి. సీబీఐ ఇచ్చిన సమాచారంతో రాష్ట్ర ఏసీబీ అధికారులు ఇద్దరు జడ్జీలను, ఒక మాజీ న్యాయమూర్తిని అరెస్టు చేశారు. ఇది కూడా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కర్ణాటకలో రాజకీయంగా దుమారం రేపిన గనుల కుంభకోణానికి సంబంధించి ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్పపై నమోదయిన కేసు దర్యాప్తు కూడా లక్ష్మీనారాయణే పర్యవేక్షించారు. మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హెలికాప్టర్‌ ప్రమాదంపైనా ఆయన విచారణ జరిపారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు చెరుకూరి రాజ్‌కుమార్‌ అలియాస్‌ ఆజాద్‌ ఎన్‌కౌంటర్‌ కేసు కూడా లక్ష్మీనారాయణే దర్యాప్తు జరిపారు. జగన్‌ అక్రమ ఆస్తుల కేసు తప్ప మిగతా కేసుల దర్యాప్తు దాదాపు పూర్తికావొచ్చింది. వీటితోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్‌, ఇష్రాత్‌ జహాన్‌ల ఎన్‌కౌంటర్ల కేసు దర్యాప్తు పర్యవేక్షణ బాధ్యత కూడా లక్ష్మీనారాయణకు అప్పగించారు. రాజకీయంగా వివాదాస్పదమైన ఈ కేసులను కూడా లక్ష్మీనారాయణకు అప్పగించడం ఆయనపై ఉన్న నమ్మకానికి నిదర్శనం.

పూర్తయిన పదవీ కాలం
డిప్యుటేషన్‌పై 2006లో రాష్ట్రంలో బాధ్యతలు చేపట్టిన లక్ష్మీనారాయణ పదవీ కాలం వాస్తవంగా 2011లోనే పూర్తయింది. అయితే అప్పటికే ముఖ్యమైన కేసుల దర్యాప్తు వివిధ దశల్లో ఉన్నందున ఆయన పదవీ కాలం మరో రెండేళ్ళపాటు పొడగించారు. ఈ జూన్‌ 10వ తేదీతో ఇది కూడా పూర్తవుతుంది. దాంతో ఆయనను సీబీఐ విధుల నుంచి రిలీవ్‌ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు సీబీఐ డైరెక్టర్‌ రంజిత్‌ సిన్హా శుక్రవారం ఢిల్లీలో ప్రకటించారు. సోమ, మంగళవారాల్లో లక్ష్మీనారాయణ బాధ్యతల నుంచి తప్పుకొని మహారాష్ట్రలో రిపోర్టు చేయనున్నారు. అక్కడి పోలీసు విభాగంలో పోస్టింగ్‌ ఇవ్వనున్నారు.

Source @ఈనాడు - హైదరాబాద్‌-5:43 AM 08-Jun-13
  • ========================
 Visit My website - > Dr.Seshagirirao

No comments:

Post a Comment